పాపప్ కెమెరాతో ‘ఆనర్’ స్మార్ట్‌టీవీ!

| Edited By:

Jul 29, 2019 | 2:01 AM

చైనా మొబైల్ మేకర్ ఆనర్ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ల విభాగానికే పరిమితమైన ఆనర్ ఇప్పుడు స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు రెడీ అయింది. అది కూడా అలాంటి ఇలాంటి టీవీ కాదు.. పాపప్ కెమెరాతో. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసి అంచనాలు పెంచేసింది. షియోమీ స్మార్ట్‌టీవీలకు పోటీగా వస్తున్న ఆనర్ టీవీలు ఆ సంస్థకు గట్టి పోటీ ఇస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 9న చైనాలో జరగనున్న హువావే డెవలపర్ సదస్సులో […]

పాపప్ కెమెరాతో ఆనర్ స్మార్ట్‌టీవీ!
Follow us on

చైనా మొబైల్ మేకర్ ఆనర్ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ల విభాగానికే పరిమితమైన ఆనర్ ఇప్పుడు స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు రెడీ అయింది. అది కూడా అలాంటి ఇలాంటి టీవీ కాదు.. పాపప్ కెమెరాతో. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసి అంచనాలు పెంచేసింది. షియోమీ స్మార్ట్‌టీవీలకు పోటీగా వస్తున్న ఆనర్ టీవీలు ఆ సంస్థకు గట్టి పోటీ ఇస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 9న చైనాలో జరగనున్న హువావే డెవలపర్ సదస్సులో ఈ పాపప్ కెమెరా టీవీని ఆనర్ అధికారికంగా ఆవిష్కరించనుంది. అయితే, అంతకంటే ముందే ఆనర్ టీవీకి సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి.

ఆనర్ టీవీ స్పెసిఫికేషన్లు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్, వీడియో కాలింగ్, పాపప్ సెల్ఫీ కెమెరా, నాయిస్ రిడక్షన్, డైనమిక్ కాంట్రస్ట్, ఆటోమెటిక్ కలర్‌ మేనేజ్‌మెంట్, 8కే వీడియో సపోర్ట్, హిస్టెన్ ఆడియో ఆప్టిమైజేషన్ టెక్నాలజీ.