AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Ministry Alert: ఎలాంటి ఓటీపీ లేకుండా కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

మెసేజ్‌లో హ్యాకర్లు పంపుతున్న నంబర్‌కు మీరు డయల్ చేస్తే వారు ముందుగా మీ ఫోన్‌కు అన్ని యాక్సెస్‌ను కలిగి ఉంటారు. ఫలితంగా మీరు ఫోన్‌లో ఏమి చేస్తున్నారో హ్యాకర్ లేదా స్కామర్ తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు ప్రమాదంలో పడిపోతారు. అంటే మీరు ఫోన్‌లో OTPని పొందరు.. కానీ మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు వారు తెలుసుకుంటారు..

Home Ministry Alert: ఎలాంటి ఓటీపీ లేకుండా కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం
Home Ministry Alert
Subhash Goud
|

Updated on: Jan 19, 2024 | 11:25 AM

Share

సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా మరో మోసం గురించి హెచ్చరిక జారీ చేసింది. దేశ ప్రజలను సురక్షితంగా ఉండాలని కోరింది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఎలాంటి ప్రమేయం లేకుండానే వినియోగదారుల బ్యాంకు ఖాతాలో డబ్బు ఖాళీ అవుతోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెచ్చరిక. చాలా సందర్భాలలో వినియోగదారులు OTPని అడగకుండానే బ్యాంకులో సొమ్ము ఖాళీ అవుతోంది.

ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాలు..

హ్యాకర్లు వ్యక్తులను ట్రాప్ చేసేందుకు ఫోన్‌కు సందేశం పంపుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు హ్యాకింగ్‌ను నివారించాలనుకుంటే ఇలా చేయండి. అంటూ ఓ మెసేజ్ వస్తోంది. ఇది ఒక సంఖ్యను కూడా ఇస్తుంది. ఈ నంబర్‌కు డయల్ చేయాలని, లేని పక్షంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని మెసేజ్ ఉంటుంది. అంటే ఫోన్ వల్ల ఉపయోగం ఉండదు. చాలా మందికి ఇది తెలియదు. కానీ వాస్తవానికి ఇది స్కామింగ్ మార్గం. *401#99963….45 (ఏదైనా నంబర్)కు కాల్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

హ్యాకర్లు పంపుతున్న నంబర్లకు డయల్‌ చేస్తే..

మెసేజ్‌లో హ్యాకర్లు పంపుతున్న నంబర్‌కు మీరు డయల్ చేస్తే వారు ముందుగా మీ ఫోన్‌కు అన్ని యాక్సెస్‌ను కలిగి ఉంటారు. ఫలితంగా మీరు ఫోన్‌లో ఏమి చేస్తున్నారో హ్యాకర్ లేదా స్కామర్ తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు ప్రమాదంలో పడిపోతారు. అంటే మీరు ఫోన్‌లో OTPని పొందరు.. కానీ మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు వారు తెలుసుకుంటారు.

ఇలాంటి మోసాలను నివారించడం ఎలా?

మీరు ఇలాంటి మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, ముందుగా అలాంటి సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వకండి. ఎందుకంటే ఫోన్ లేదా సిమ్ కార్డ్ హ్యాక్ అయితే ఫోన్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వరు. చాలా సందర్భాలలో మీరు యాప్‌ని ఫోన్‌కి డౌన్‌లోడ్ చేయమని కూడా అడగబడతారు. వాస్తవానికి ఇది VPN యాప్. ఇది మీ ఫోన్ నుండి మొత్తం డేటాను దొంగిలిస్తుంది. అందుకే తెలియని నంబర్‌ల లింక్‌పై క్లిక్ చేయవద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి