Aadhaar Update: ఆధార్‌ కార్డులో మీ ఫొటో నచ్చట్లేదా? ఇదిగో ఇలా సింపుల్‌గా మార్చేయండి..

|

Apr 26, 2023 | 9:44 AM

సాధారణంగా ఆధార్‌లో ఆ వ్యక్తి పేరు, ఫొటో, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఇది అడ్రస్‌ ప్రూఫ్‌ కింద వినియోగించుకోవచ్చు. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ కార్డులో ఏమైనా తప్పలు దొర్లితే? వాటిని సరిచేయాలంటే ఏమి చేయాలి? దానిలోని ఫొటోను అప్‌డేట్‌ చేయాలంటే ప్రాసెస్‌ ఏంటి?

Aadhaar Update: ఆధార్‌ కార్డులో మీ ఫొటో నచ్చట్లేదా? ఇదిగో ఇలా సింపుల్‌గా మార్చేయండి..
Aadhaar Card
Follow us on

ఆధార్‌ కార్డు.. ప్రతి భారత పౌరుడికి ఇది తప్పనిసరి. అన్నింటికీ ఇదే ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా? కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా? ఏదైన ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్‌ నంబర్‌ అవసరం. ప్రస్తుత డిజిటల్‌ వ్యవస్థలో ఇది లేకుండా మనుగడ సాధించడం అసాధ్యమనే చెప్పాలి. ఆధార్‌ నంబర్‌ని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ఇస్తుంది. దీనిలో 12 సంఖ్యలు ఉంటాయి. బయోమెట్రిక్స్‌ అంటే చేతివేళ్లు, కళ్ల ఆధారంగా దీనిలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ బయోమెట్రిక్‌ ఐడీ వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్దది.

సాధారణంగా ఆధార్‌లో ఆ వ్యక్తి పేరు, ఫొటో, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఇది అడ్రస్‌ ప్రూఫ్‌ కింద వినియోగించుకోవచ్చు. అలాగే ఆధార్‌కు లింకైన ఫోన్‌ నంబరే బ్యాంకులు తీసుకుంటాయి. అలా ఉంటేనే అన్ని రకాల ప్రయోజనాలు పొందగలం. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ కార్డులో ఏమైనా తప్పలు దొర్లితే? వాటిని సరిచేయాలంటే ఏమి చేయాలి? దానిలోని ఫొటోను అప్‌డేట్‌ చేయాలంటే ప్రాసెస్‌ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆధార్‌లో ఏమి అప్‌ డేట్‌ చేసుకోవచ్చు..

ఆధార్‌ కార్డులోని పేరు, చిరునామా, పుట్టిన తేది, జెండర్‌, ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ వంటివి మార్పులు చేసుకోవచ్చు. అలాగే మీ చేతి వేళ్ల ముద్రలు, ఐరిస్‌, ఫోటోలను అప్‌ డేట్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వివరాల్లో మార్పులు ఇలా..

మీ ఆధార్‌ కార్డులోని వివరాల్లో మార్పులు, చేర్పులు చేయాలంటే రెండు రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి.

  • ఒకటి మీ దగ్గరలోని ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ సందర్శించడం ద్వారా చేయవచ్చు. దీని కోసం మీరు uidai.gov.in వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి.. ‘లోకేట్‌ యాన్‌ ఎనరోల్‌మెంట్‌ సెంటర్‌’ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • రెండో విధానం ఏమిటంటే మై ఆధార్‌ యాప్‌ ద్వారా.. మై ఆధార్‌ యాప్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకొని, దానిలో రిజిస్టర్‌ అయ్యి, ఆన్‌లైన్‌ డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌ సర్వీస్‌ ఆప్షన్‌ ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో మార్చాలంటే ఏమి చేయాలి..

  • ఆధార్‌ కార్డులో ఫొటో మార్చాలంటే మాత్రం మీ సమీపంలోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ కు వెళ్లాల్సిందే. అందుకోసం https://appointments.uidai.gov.in/ లోకి వెళ్లి అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసుకోవాలి.
  • ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌కు వెళ్లి ఫొటో మార్పునకు అవసరమైన ఫారమ్‌ ఫిల్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత సెంటర్‌ లో మీ బయోమెట్రిక్స్‌ తీసుకొని మీ అప్లికేషన్‌ ను ఫార్వర్డ్‌ చేస్తారు.
    మీ కొత్త ఫొటోను ఆపరేటర్‌ క్యాప్చర్‌ చేస్తారు. ఇలా చేసినట్టు మీకో ఎక్నోలడ్జ్‌మెంట్‌ స్లిప్‌ ఇస్తారు. దానిలో అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(యూఆర్‌ఎన్‌) ఉంటుంది. దీని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అప్‌డేట్‌ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్‌ నుంచి ఈ-ఆధార్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..