Electric cars: అందుబాటులోకి కొత్త టెక్నాలజీ.. ఇక నిమిషాల్లోనే 0 నుంచి 100శాతం కారు బ్యాటరీ చార్జ్..

|

May 06, 2023 | 5:30 PM

Battery Swapping Tech: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్ సమయం. అయితే ఈ సమస్యకు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఫిస్కర్ పరిష్కారాన్ని కనుగొంది. కేవలం నిమిషాల వ్యవధిలో జీరో నుంచి ఫుల్ బ్యాటరీని చేసే ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. 

Electric cars: అందుబాటులోకి కొత్త టెక్నాలజీ.. ఇక నిమిషాల్లోనే 0 నుంచి 100శాతం కారు బ్యాటరీ చార్జ్..
Electric Car Charging
Follow us on

ఎలక్ట్రిక్ కార్లలో ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్. ఈ కార్లలో దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. బ్యాటరీ చార్జింగ్ టైం ఎక్కువగా ఉండటం. చార్జింగ్ స్టేషన్లు పెద్దగా అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. అయితే ఈ సమస్యకు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఫిస్కర్ పరిష్కారాన్ని కనుగొంది. కేవలం 20 నుంచి 60 నిమిషాల వ్యవధిలో జీరో నుంచి ఫుల్ బ్యాటరీని చేసే ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. అదే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. అంటే చార్జ్ అయి పోయిన బ్యాటరీ స్థానంలో ఫుల్ చార్జ్ అయిన మరో బ్యాటరీని ఇన్ స్టంట్ గా రిప్లేస్ చేయడం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫిస్కర్, యాంపిల్ సంయుక్తంగా..

ఫిస్కర్ కంపెనీ యాంపిల్ సంస్థతో కలిసి ఈ బ్యాటరీ స్పాపింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఫిస్కర్ కు చెందిన ఓషన్ ఎస్ యూవీ వినియోగదారుల కోసం 2024లో దీనిని ప్రారంభించింది. ఈ బ్యాటరీ స్వాపింగ్ విధానం ఓ కారుకు గ్యాసోలిన్ ను నింపడానికి ఎంత ధర అవుతుందో అంతే అవుతుందని పేర్కొంది.

ఎలా పని చేస్తుంది..

మీ కారులోని బ్యాటరీలో చార్జ్ అయిపోవచ్చిందనుకోండి.. వెంటనే యాంపిల్స్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లాలి. వారు వాహనాన్ని వెంటనే పైకి లేపి చార్జ్ అయిపోయిన బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని అమర్చుతారు. ఇదంటా ఆటోమేటిక్ గానే జరిగిపోతుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఫుల్ చార్జ్ అయిన బ్యాటరీని కారులో ఇన్ స్టాల్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ప్రారంభం..

కాలిఫోర్నియాలోని ఉబెర్ డ్రైవర్స్ ఇప్పటికే ఈ యాంపిల్స్ టెక్ ని వినియోగిస్తున్నారు. దీని వల్ల బ్యాటరీ చార్జ్ అవడానికి అయ్యే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పుడు యాంపిల్ కంపెనీ తన స్టేషన్లను ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూరోప్ లో దీనిని ముందుగా ఆవిష్కరిస్తోంది.

చైనాలో ఎప్పటి నుంచో..

అమెరికాలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ స్వాపబుల్ టెక్నాలజీ.. చైనాలో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. నియో అనే చైనా స్టార్టప్ దీనిని అభివృద్ధి చేసింది. దీనికి చైనా వ్యాప్తంగా వందలాది స్వాపబుల్ స్టేషన్లు ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..