ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో గ్రేట్ సమ్మర్ సేల్ 2023 నడుస్తోంది. అన్ని వస్తువులపై అదిరిపోయే ఆఫర్ల అందులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల దగ్గర నుంచి గృహోపకరణాల వరకూ ప్రతి దానిలోనూ పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం వ రకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. అదే విధంగా పలు ట్యాబ్లెట్లపై కూడా అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో ట్యాబ్లెట్లపై ఉన్నడీల్స్ ఏంటో చూద్దాం రండి..
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2022.. మీరు డిజైనింగ్ లేదా కంటెంట్ క్రియేషన్‌లో ఉన్నవారైతే.. స్మార్ట్‌ఫోన్ కంటే పెద్ద పరికరం కోసం చూస్తున్నట్లయితే, మీకు ఐప్యాడ్ మంచి ఎంపిక. ఐప్యాడ్ ఎయిర్ 2022 శక్తివంతమైన యాపిల్ ఎంఐ చిప్‌సెట్‌తో పాటు పెద్ద 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక వైపు 12ఎంపీ కెమెరా, ముందు వైపు 12ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని సాధారణ ధర రూ. 59,900, కాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో దీనిని రూ. 51,999కే పొందవచ్చు.
శామ్సంగ్ గేలాక్సీ ట్యాబ్ ఎస్8ప్లస్.. మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే శామ్సంగ్ గేలాక్సీ ట్యాబ్ ఎస్8ప్లస్ మంచి ఎంపిక. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఎస్ పెన్ సపోర్ట్‌తో వస్తుంది. 12.4-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో ఇది వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8జన్1 చిప్ సెట్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందువైపు 12ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 10,090mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని అసలు ధర రూ. 99,999 అయితే అమెజాన్లో సేల్లో ప్రస్తుతం రూ. 84,990కి అందుబాటులో ఉంది.
రెడ్మీ ప్యాడ్.. తక్కువ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే దీనిని మీరు పరిగణించవచ్చు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 10.61-అంగుళాల 2కే ఎల్సీడీ డిస్ ప్లే తో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ99 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్ మరియు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వెనుకవైపు 8ఎంపీ కెమెరా, ముందు వైపు కూడా 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్టుతో కూడిన 8,000mAh బ్యాటరీతో వస్తోంది. దీని అసలు ధర రూ. 28,999కాగా.. అమెజాన్ లో రూ. 16,999కి వస్తోంది.
ఒప్పో ప్యాడ్ ఎయిర్.. తక్కువ ధరలో లభించే మరో మంచి ట్యాబ్లెట్ ఒప్పో ప్యాడ్ ఎయిర్. ఇది 10.36-అంగుళాల 2కే ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4జీబీ ర్యామ్ 64జీబీ అంతర్గత నిల్వతో వస్తుంది. వెనుకవైపు 8ఎంపీ, ముందు వైపు 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఇది 18వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,100mAh బ్యాటరీతో ఇది వస్తుంది. దీని సాధారణ ధర రూ. 28,999కాగా, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో కేవలం రూ. 16,999కే లభ్యమవుతోంది.
నోకియా టీ10.. నోకియా నుంచి వస్తున్న ఎంట్రీ లెవల్ ట్యాబ్లెట్ ఇది. దీనిలో 8-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే ఉంటుంది. యూనిసోక్ టీ606 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత నిల్వను కలిగి ఉంది. వెనుక వైపు 8ఎంపీ, ముందు వైపు 2MP కెమెరా ఉంటాయి. దీనిలో 5,250mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీతో ఈ ట్యాబ్లెట్ వస్తుంది. దీని ధర రూ. 14,499 కాగా, ప్రస్తుతం అమెజాన్ సేల్ లో రూ. 10,999కే లభిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..