
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారులకు అనేక సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ మెరుగైన సేవలు అందిస్తోంది. దేశంలో ఎక్కువ మంది యూజర్లు ఉన్న నెట్ వర్క్ గా చెలామణి అవుతోంది. దీనిలో భాగంగా మరో కొత్త ఫీచర్ ను ప్రకటించింది. దీనితో యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని భావిస్తోంది. కొత్తగా జియో ఫోన్ కాల్ ఏఐ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలు, పనితీరు విధానాన్ని తెలుసుకుందాం.
ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) దూసుకుపోతోంది. అన్ని ప్రముఖ కంపెనీలు ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి. దానిలో భాగంగానే జియో కూడా తమ యూజర్లకు పరిచయం చేసింది. ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో ఏఐ ద్వారా మనకు కొత్త సేవలు అందుతాయి. రియల్ టైమ్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, మెసేజ్, అనువాదం తదితర సేవలు అందుతాయి. ముఖ్యంగా కాల్ నిర్వహణను మెరుగుపర్చడం దీని ప్రధాన ఉద్దేశం.
రిలయన్స్ జియో 47వ వార్షిక సాధారణ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా జియో ఫోన్‌కాల్ ఏఐ అనే ఏఐ ఆధారిత సేవలను కంపెనీ పరిచయం చేసింది. జియో అందించిన ఈ కొత్త సేవ ద్వారా మన ఫోన్ కాల్ కు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను అనుసంధానిస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ సంభాషణలను రికార్డ్ చేయడానికి, అనువదించడానికి, పంపించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అన్ని భాషలలో ఫోన్ కాల్ నిర్వహణ మెరుగవుతుంది.
జియో అందించిన కొత్త ఏఐ ఆధారిత సేవనే జియో ఫోన్ కాల్ ఏఐ అని పిలువొచ్చు. ఫోన్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. మనం మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా మార్చడం, సంభాషణలను సేవ్ చేయడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం తదతర వాటిని చాలా సులభంగా నిర్వహిస్తుంది.
జియో తీసుకువచ్చిన కొత్త ఫీచర్ ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే విషయంపై సరైన స్పష్టత లేదు. కొన్ని వారాల్లో ఈ సేవను అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..