Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

|

May 03, 2023 | 3:30 PM

కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు హోల్డర్స్ వారు తమ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారు.. ఈ మెయిల్ ఐడీ ఏమి ఇచ్చారు.. వంటి వివరాలు మర్చిపోతున్నారు. దీని వల్ల ఎప్పుడైనా ఓటీపీలు సేకరించాలకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించిన యూఐడీఏఐ పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించింది.

Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..
Aadhaar Card
Follow us on

మీ ఆధార్ నంబర్ కు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారో మర్చిపోయారా? ఆధార్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ మీరు మార్చేశారా? ఆ నంబర్ ఇప్పుడు మీ దగ్గర లేదా? మీరేమి టెన్షన్ పడనవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలను సులభంగా వెరిఫై చేసుకొనే వెసులుబాటును కల్పించింది. ఏ ఫోన్ నంబర్, ఈ మెయిల్ మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉందో తెలుసుకొనే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎలా చేయాలంటే..

కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు హోల్డర్స్ వారు తమ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారు. ఈ మెయిల్ ఐడీ ఏమి ఇచ్చారు వంటి వివరాలు మర్చిపోతున్నారు. దీని వల్ల ఎప్పుడైనా ఓటీపీలు సేకరించాలకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించిన యూఐడీఏఐ పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించింది. కార్డు దారులు https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లి వెరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ ను క్లిక్ చేయాలి. అలాగే ఎంఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని వెరిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉన్న ఈ మెయిల్, ఫోన్ నంబర్ తెలుస్తోంది. ఒకవేళ లింక్ చేసి లేకపోతే నంబర్, ఈ మెయిల్ ఐడీ మార్చుకునేందుకు అవసరమైన సూచనలను కూడా ఇస్తుంది.

ఇవి కూడా చదవండి
  • ఒక వేళ మొబైల్ నంబర్ ఇప్పటికే వెరిఫై అయితే మీకు ‘ది మొబైల్ నంబర్ యూ హావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్ రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్’ అని డైలాగ్ బాక్స్ డిస్ ప్లేపై కనిపిస్తుంది.
  • ఒకవేళ మీరు ఎంటర్ చేయడానికి మీకు ఫోన్ నంబర్ గుర్తులేదనుకోండి అప్పుడు మీ ఫోన్ నంబర్ లోని చివరి మూడు నంబర్లు కనిపిస్తాయి. దాని ద్వారా ఏ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉందో గుర్తించొచ్చు.
  • ఒకవేళ మీరు ఫోన్ నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ మార్చుకోవాలి అనుకుంటే దగ్గరలోని ఆధార్ సెంటర్ లో సంప్రదించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..