Spam Calls: ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..

|

Jul 05, 2024 | 4:23 PM

స్పామ్ కాల్స్ తో విసిగిపోయారా? వాటిని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఎన్నిసార్లు స్పామ్ రిపోర్టులు కొట్టినా కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయా? అయితే మీలాంటి వారి కోసమే గూగుల్ ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు కాలర్ ఐడీ, స్పామ్ ప్రోటెక్షన్ అనే పేర్లతో వీటిని అందుబాటులో ఉంచింది. మీ ఫోన్లలో వీటిని ఎనేబుల్ చేయడం ద్వారా స్పామ్ కాల్స్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు.

Spam Calls: ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..
Spam Calls
Follow us on

స్మార్ట్ ఫోన్ లేని సమాజాన్ని మనం ఊహించలేం. అరచేతిలో ఇమిడిపోయిన ఈ టెక్ గ్యాడ్జెట్ మనిషిని శాసిస్తోందని చెప్పాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో మనకు చేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంది. అయితే దీని ద్వారా ఎంత మేర ప్రయోజనాలు ఉన్నాయో.. సక్రమంగా వినియోగించకపోతే అంతే స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాక ఇటీవ పెరిగిపోతున్న ఆన్ లైన్ మోసాలు కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగంపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్న విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. వీటితో పాటు నేరగాళ్లు కొన్ని స్పామ్ కాల్స్ ద్వారా మనల్ని మోసం చేస్తున్నారు. అలాగే కొన్ని సార్లు మనకు ఈ స్పామ్ కాల్స్ కారణంగా విసుగుకూడా వస్తుంది. చాలా ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈ ఫోన్లు వచ్చి.. లోన్ ఆఫర్లని, క్రెడిట్ కార్డు ఆఫర్లని చెప్పి ఇరిటేట్ చేస్తుంటారు. ఆ సమయంలో మనకు అసహనం కలుగుతుంది. కొన్ని స్పామ్ కాల్స్ ని నమ్మి కొన్ని పెట్టుబడి పథకాలలో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన ఉదంతాలు కూడా మనం చాలానే చూస్తున్నాం. అలాంటి సందర్భంలో మరి ఈ స్పామ్ కాల్స్ నుంచి ఎలా బయట పడాలి? వాటికి చెక్ పెట్టలేమా? అంటే పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఫోన్ సెట్టింగ్స్ ఉపయోగించి, గూగుల్ యాప్స్ వినియోగించి అస్సలు స్పామ్ కాల్స్ రాకుండా చేసుకోవచ్చని వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

రెండు గూగుల్ ఫీచర్లు..

స్పామ్ కాల్స్ తో విసిగిపోయారా? వాటిని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఎన్నిసార్లు స్పామ్ రిపోర్టులు కొట్టినా కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయా? అయితే మీలాంటి వారి కోసమే ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. కాలర్ ఐడీ, స్పామ్ ప్రోటెక్షన్ అనే పేర్లతో వీటిని అందుబాటులో ఉంచింది. మీ ఫోన్లలో వీటిని ఎనేబుల్ చేయడం ద్వారా స్పామ్ కాల్స్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు. అదెలా అంటే..

కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్..

మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే.. మీ ఫోన్లోకి వెళ్లి కాల్ సింబల్ తో కనిపించే ఫోన్ యాప్ ని క్లిక్ చేయాలి. దానిలో మీకు కాల్ లాగ్ కనిపిస్తుంది. దానికి పైగా కుడివైపున మూడు చుక్కలు మీకు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. అందులో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేయాలి. వెంటనే మీకు ఓ డైలాగ్ బాక్స్ కింద కనిపిస్తుంది. దానిలో టెర్మ్స్ అండ్ కండిషన్స్ ను అంగీకరిస్తున్నారా అని అడుగుతుంది. దానికి ఎగ్రి అని చూపించే బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో కాలరఱ్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది.

బ్లాక్ అండ్ రిపోర్ట్.. అయినా ఏదైనా కొత్త నంబర్లతో స్పామ్ కాల్స్ వస్తుంటే ఆ నంబర్ ను రిపోర్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం ఫోన్ యాప్ లోనే మీకు వచ్చిన స్పామ్ నంబర్ క్లిక్ చేసి బ్లాక్ లేదా రిపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ నంబర్ నుంచి ఇక కాల్స్ రావు.

స్పామ్ కాల్ ఫిల్టరింగ్..

పైన పేర్కొన్న ఫీచర్స్ మాత్రమే కాక.. ఓ యాప్ సాయంతో కూడా ఈ కాల్స్ కు చెక్ పెట్టొచ్చు. అదెలా అంటే.. ముందుగా మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి.. దానిలో ఫోన్ బై గూగుల్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని, దానిని డీఫాల్ట్ డయలర్ గా ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి కాలర్ ఐడీ అండ్ స్పామ్ బ్లాక్ ను ఎనేబుల్ చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..