iQOO Z9 Lite: తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఫీచర్ ప్యాక్డ్.. పనితీరులో ఫస్ట్ క్లాస్..

|

Jul 22, 2024 | 1:47 PM

ఇటీవల ఐకూ జెడ్9 లైట్(iQOO Z9 Lite) కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇది మీడియా టెక్ 6300 చిప్‌తో ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 90హెర్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

iQOO Z9 Lite: తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఫీచర్ ప్యాక్డ్.. పనితీరులో ఫస్ట్ క్లాస్..
Iqoo Z9 Lite 5g
Follow us on

ప్రస్తుం మార్కెట్లో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో అందరూ 5జీ ఫోన్ల వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో అన్ని టెక్ కంపెనీలు తమ 5జీ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఈ 5జీ లాంచ్ అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఐకూ జెడ్9 లైట్(iQOO Z9 Lite) కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇది మీడియా టెక్ 6300 చిప్‌తో ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 90హెర్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐకూ జెడ్9 లైట్ డిజైన్..

ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న ధరల శ్రేణిని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఉబెర్ కూల్ డిజైన్‌ను కలిగి ఉంది. పరికరం ప్లాస్టిక్ బిల్డ్ బాడీని కలిగి ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్-డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్ దృఢంగా అనిపిస్తుంది, కఠినమైన ప్రొఫైల్‌ను ప్రదర్శిస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ని పొందుతారు. ఇది ఐపీ64-రేటింగ్ కలిగిన పరికరం.

ఐకూ జెడ్9 లైట్ డిస్ ప్లే..

ఇది 90హెర్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల హెచ్డీ+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఒకే స్పీకర్‌ని కలిగి ఉంది. అయితే ఖచ్చితమైన మల్టీమీడియా అనుభవానికి అవసరమైన ‘లౌడ్‌నెస్’ లేదు. ఇది వైడ్ వైన్ ఎల్1(Widevine L1) సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఐకూ జెడ్9 లైట్ కెమెరా..

ఐకూ జెడ్9 లైట్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు 50ఎంపీ ప్రైమరీ షూటర్ ని కలిగి ఉంది. పగటి వెలుగులో, కెమెరా మంచి ఫొటోలను సంగ్రహిస్తుంది. అయితే కాంతి తక్కువగా ఉన్నప్పుడు అంత క్వాలిటీ పిక్చర్స్ రావు. ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుతారు. ఇది ఉత్తమమైనది కాకపోయినా సంతృప్తికరమైన పనిని చేస్తుంది.

ఐకూ జెడ్9 లైట్ పనితీరు..

దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 11,499గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్,128జీబీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 10,499గా ఉంది. రోజువారీ కార్యకలాపాలు ఎటువంటి వేడి సమస్యలు లేకుండా సులభంగా నిర్వహించుకోవచ్చు. గేమింగ్ సెషన్‌లను కూడా అనుమతిస్తుంది. కానీ తక్కువ గ్రాఫిక్ సెట్టింగ్‌లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ప్రీ ఇన్ స్టాల్డ్ బ్లోట్‌వేర్‌తో వస్తుంది.

ఐకూ జెడ్9 బ్యాటరీ..

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. పూర్తి చార్జ్‌తో సులభంగా ఒక రోజంతా పనిచేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..