Telecom Companies: మొబైల్ ఫోన్ కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని భద్ర పరిచే గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలన్ని రెండు సంవత్సరాల పాటు భద్రపరిచాలని టెలికం ప్రొవైడర్లకు కేంద్ర టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఏడాది పాటు మాత్రమే మొబైల్ ఫోన్‌ల కాల్ డేటా, ఇంటర్నెట్ యూసేజీ వివరాలను టెలికం సంస్థలు నిల్వ చేస్తూ వచ్చాయి. రెండు సంవత్సరాల తర్వాత కూడా టెలికం శాఖ నుంచి ఎటుంవంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ కాల్ డేటా వివరాలను, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తొలగించవచ్చని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం.. టెలికం సంస్థలు తమ కస్టమర్ల లాగిన్, లాగౌడ్‌కు సంబంధించిన వివరాలు రెండు సంవత్సరాలు మాత్రమే భద్రంగా ఉంటాయి. ఈమెయిల్, మొబైల్ అప్లికేషన్ల కాల్స్, ఇతర యాప్‌లలో లాగిన్ తదితర సమాచారాన్ని రెండు సంవత్సరాల పాటు నిల్వ చేయాల్సి ఉంటుంది.
ప్రజల ప్రయోజనాల దృష్ట్యా , రాష్ట్ర భద్రత దృష్ట్యా ఈ సవరణ అవసరమని కేంద్రం సర్క్యూలర్‌లో పేర్కొంది. ఈ సవరణ ద్వారా సబ్‌స్క్రైబర్‌ల డేటా రికార్డులను నిర్వహించడం టెల్కోలకు తప్పనిసరి చేస్తుంది. అందులో లాగిన్, సేవలకు అందరు సబ్‌స్క్రైబర్‌ల వివరాలతో పాటు లాగ్అవుట్ చేయడం కూడా తప్పనిసరి. వీటిలో ఇంటర్నెట్ యాక్సెస్, ఇమెయిల్ వంటి మొబైల్ అప్లికేషన్‌ల నుండి కాల్‌లు, ఇంటర్నెట్ సేవల వివరాలు, కనీసం రెండు నెలల పాటు వైఫై కాలింగ్ డేటా ఉంటాయి.
ఇవి కూడా చదవండి: