Google Pixel 7A: దిగ్గజ సెర్జ్ ఇంజిన్ గూగుల్ నుంచి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్‌ఫోన్స్ విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది గూగుల్. ఈ నెల 10న జరగబోయే Google IO 2023 ఈవెంట్‌లో Google Pixel 7A మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుది. ఈ ఈవెంట్‌లోనే Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ సహా అనేక రకాల ప్రోడక్ట్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా ధృవీకరించింది.
గూగుల్ నుంచి లాంచ్ కాబోతున్న Google Pixel 7A మోడల్ 128 GB స్టోరేజ్ వేరియంట్‌ధర సుమారు రూ. 46 వేలు ఉంటుంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇదే కాక 90 Hz రిఫ్రెష్ రేట్‌న కలిగిన ఈ ఫోన్ Android 13 తో పాటు Tensor G2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే దీని బ్యాటరీ సామర్థ్యం 4400 mAh కాగా 18W ఫాస్ట్ ఛార్జ్ సప్పోర్ట్ ఉంది. మరో ప్రత్యేకత ఏమిటంటే దీనికి 5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
How to show excitement without shouting? Asking for a friend
Coming to @Flipkart on 11th May. pic.twitter.com/il6GUx3MmR
— Google India (@GoogleIndia) May 2, 2023
కాగా, ఈ ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్స్‌తో, సెకండరీగా 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇంకా ఫోన ముందు భాగంలో 10.8 MP ఫ్రంట్ కెమెరాతో పాటు డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. మరోవైపు ఈ ఫోన్ అన్‌లైన్ సేల్ ఈ నెల 11న ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..