Google Retail Store: ఆపిల్ బాటలో గూగుల్ అడుగులు.. న్యూయార్క్‌లో తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటు..

|

Jun 18, 2021 | 9:55 PM

Google Retail Store: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆపిల్ కంపెనీ బాట పట్టింది. గూగుల్ తన మొట్టమొదటి రిలైట్ స్టోర్‌ని ప్రారంభించింది.

Google Retail Store: ఆపిల్ బాటలో గూగుల్ అడుగులు.. న్యూయార్క్‌లో తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటు..
Google
Follow us on

Google Retail Store: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆపిల్ కంపెనీ బాట పట్టింది. గూగుల్ తన మొట్టమొదటి రిలైట్ స్టోర్‌ని ప్రారంభించింది. హార్డ్‌వేర్ ఉత్పత్తులతో ప్రారంభించిన ఈ స్టోర్‌ను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేశారు. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో పిక్సెల్ ఫోన్లు, వేరబుల్ గ్యాగ్జెట్స్, ఫిట్‌బిట్ పరికరాలు, ఫిక్సెల్ బుక్స్ మొదలు.. గూగుల్ తయారు చేసిన అన్ని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభించనున్నాయి. కాగా, గూగుల్ స్టోర్ ఏర్పాటును వెల్లడిస్తూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం నాడు ఒక ట్వీట్ చేశారు. ‘‘న్యూయార్క్ సిటీలో(NYC) మా కొత్త గూగుల్ స్టోర్‌ని సందర్శించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇది అద్భుతమైన స్టం. ఎల్ఈఈడీ ప్లాటినం రేటింగ్‌ కలిగిన ప్రపంచంలోని 215 స్టోర్‌లలో గూగుల్ స్టోర్ కూడా ఒకటి. న్యూయార్క్ రాగానే ఈ స్టోర్‌ను సందర్శిస్తారు.’ అని సుందర్ పిచాయ్‌ ట్వీట్ చేశారు.

కాగా, గూగుల్ ఏర్పాటు చేసిన రిటైల్ స్టోర్ ప్రాంతంలో గతంలో ఒక పోస్ట్ ఆఫీస్, స్టార్ బక్స్ ఉండేవి. లీజ్ గడువు ముగియడంతో గూగుల్ ఈ ప్లేస్‌లో రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. గేమింగ్ ప్లేస్, హోమ్/నెస్ట్ ఉత్పత్తుల టెస్టింగ్ కోసం సౌండ్ ప్రూఫ్ స్పాట్ కూడా ఉంది. కాగా, ఆపిల్ స్టోర్ మాదిరిగా కస్టమర్లు పిక్సెల్ ఫోన్‌ల మరమ్మతుల కోసం గూగుల్ స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గూగుల్ స్టోర్‌లోకి వచ్చే కస్టమర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు పాటించేలా నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కస్టమర్ల సంఖ్యను పరిమితం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. నడుచుకుంటామని కంపెనీ ప్రతినిధి రొసెన్తాల్ తెలిపారు.

sundar pichai tweet

Also read:

Yanamala : ఉద్యోగ నియామకాలపై నిజంగా పారదర్శకత ఉండాలని భావిస్తే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్ సైట్లో పెట్టండి : యనమల