Google Gpt: చాట్ జీపీటీకు కోలుకోలేని షాక్..గూగుల్ సీఈఓ సంచలన ప్రకటన..

|

Feb 08, 2023 | 10:08 AM

గూగుల్ సీఈఓ సత్య నాదేళ్ల చాట్ జీపీటీకి షాక్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐకు పోటీగా గూగుల్ కొత్త చాట్ బాట్ ను తీసుకొస్తుందని ఓ బ్లాగ్ లో వివరించారు. ఈ చాట్ బాట్ పేరు బార్డ్ అని ఇది కూడా ఓపెన్ ఏఐతో పని చేస్తుందని పేర్కొన్నారు.

Google Gpt: చాట్ జీపీటీకు కోలుకోలేని షాక్..గూగుల్ సీఈఓ సంచలన ప్రకటన..
Follow us on

ప్రస్తుతం మార్కెట్ లో చాట్ జీపీటీ ఫీవర్ నెలకొని ఉంది. రోజుకో వార్తతో చాట్ జీపీటీ ఓ సంచలనాన్ని రేకెత్తిస్తుంది. చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తే గూగుల్ కు భారీ నష్టమేనంటూ పలు నివేదికలు కూడా పేర్కొన్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో గూగుల్ సీఈఓ సత్య నాదేళ్ల చాట్ జీపీటీకి షాక్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులతో చాట్ జీపీటీ సంచలనాలను నమోదు చేస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయం. అయితే ఇలాంటి వార్తకు సత్య నాదెళ్ల చెక్ పెట్టారు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐకు పోటీగా గూగుల్ కొత్త చాట్ బాట్ ను తీసుకొస్తుందని ఓ బ్లాగ్ లో వివరించారు. ఈ చాట్ బాట్ పేరు బార్డ్ అని ఇది కూడా ఓపెన్ ఏఐతో పని చేస్తుందని పేర్కొన్నారు. తొందరలోనే ఇది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 

ప్రస్తుతం వినియోగదారుల ఫీడ్ బ్యాక్ కోసం ఏఐ సర్వీస్ బార్డ్ ను రిలీజ్ చేస్తున్నామని త్వరలోనే పబ్లిక్ గా రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. బార్డ్ కోసం కొన్ని ప్రాథమిక కార్యచరణలను వివరించారు. బార్డ్ అంటే ప్రయోగాత్మక సంభాషణ ఉండే ఏఐ అని పేర్కొన్నారు. లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ ( LaMDA) ద్వారా ఈ ఏఐ సేవలు పని చేస్తాయని వివరించారు. బార్డ్ సమస్త సమాచారాన్ని గూగుల్ వెబ్ నుంచి పొందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గూగుల్ బార్డ్ ప్రస్తుతం లామ్ డా తేలికపాటి వెర్షన్ రిలీజ్ చేస్తుంది. దీనికి తక్కువ కంప్యూటింగ్ శక్తి అవసరం. దీంతో ఎక్కువ మంది వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. బార్డ్ విశ్వసనీయ పరీక్షల కోసం భవిష్యత్ పూర్తి యాక్సెస్ ను ఇస్తామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ కొత్త చాట్ జీపీటీను దాని సొంత శోధన ఇంజిన్ బింగ్ కు పరిచయం చేయాలని భావిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..