Google Chrome update: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అయితే అప్‌డేట్ చేయాల్సిందే..
మీరు గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేయకుండా వాయిదా వేస్తూ ఉంటే, ఇప్పటకీ 48వ వెర్షన్ వాడుతుంటే దానిని నిలిపివేస్తామని గూగుల్ వెల్లడించింది...
మీరు గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేయకుండా వాయిదా వేస్తూ ఉంటే, ఇప్పటకీ 48వ వెర్షన్ వాడుతుంటే దానిని నిలిపివేస్తామని గూగుల్ వెల్లడించింది. ఈ వెర్షన్ బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, చరిత్ర, ఓపెన్ ట్యాబ్‌లు కంపెనీ సర్వర్‌లలో నిల్వ చేస్తుంది కాబట్టి వాటిని ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. అందుకే దానిని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అందరు కొత్తగా ప్రవేశపెట్టిన వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచింది. బ్రౌజర్ వెర్షన్ ఎం48 లేదా అంతకంటే తక్కువ ఈ వెర్షన్లను నిలిపివేస్తామని పేర్కొంది. ఎం49 లేదా అంతకంటే ఎక్కవ వెర్షన్‌ను ప్డేట్ చేసుకోవాలని సూచింది.
క్రోమ్ అప్‌డేట్ చేసుకోవాలంటే వినియోగదారులు బ్రౌజర్ యొక్క కుడి ఎగువన ఉన్న మెనుపై క్లిక్ చేసి, “Google Chromeని అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. అప్డేట్పై క్లిక్ చేయడం ద్వారా Chrome వెర్షన్ 49 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌కి మారిపొవచ్చు. ఈ ఎంపిక కనిపించకపోతే ఇప్పటికే క్రోమ్ యొక్క తాజా సంస్కరణను అమలు చేస్తున్నారని గమనించాలని చెప్పింది. క్రోమ్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే, ఐకాన్ రెండు రోజుల క్రితం విడుదల చేయబడితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అప్‌డేట్ నాలుగు రోజుల క్రితం విడుదల చేయబడితే ఆరెంజ్, కనీసం వారం క్రితం అప్‌డేట్ విడుదల చేయబడితే ఎరుపు రంగులో ఉంటుందని వెల్లడించింది.
క్రోమ్ అప్‌డేట్ చేసిన తర్వాత మీ బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేయాలి. కంపెనీ బ్రౌజర్ ప్రస్తుతం వెర్షన్ 95లో ఉంది. అయితే వెర్షన్ 96 దాని స్థిరమైన ఛానెల్‌ని త్వరలో చేరుకోవడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ అప్‌డేట్ తర్వాత సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read Also.. Demonetization: నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా.. ఆభివృద్ధికి ఏమేర దోహదపడింది.. అసలేం జరిగింది..