folding electrical car: ఈ ఎలక్ట్రిక్ కారును ఎంచక్కా మడతెట్టేసుకోవచ్చు..! కొత్త మోడల్స్‌తో దూసుకొస్తున్న కార్ల సంస్థలు.. (వీడియో)
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మార్కెట్‌లోకి కొత్తకొత్త మోడల్స్‌తో పాటు వెరైటీ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి. అయితే....
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మార్కెట్‌లోకి కొత్తకొత్త మోడల్స్‌తో పాటు వెరైటీ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడో వెరైటీ ఎలక్ట్రిక్ కారును రెడీ చేసింది డెన్మార్క్‌కు చెందిన ఓ కార్ల సంస్థ. సిటీ ట్రాన్స్ ఫార్మర్ అనే పేరిట మార్కెట్‌లోకి రానున్న కారును.. మడత పెట్టే సౌలభ్యం కూడా ఉంది. కేవలం వంద సెంటి మీటర్ల వెడల్పులోనే కారును పార్క్ చేసుకోవచ్చు. అయితే అతి త్వరలోనే యూరప్ మార్కెట్‌లోకి విడుదల కానున్న ఈ కారు గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందంటా. ఐదు సెకన్లలోనే 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. బ్యాటరీని చార్జ్ చేస్తే ఆగకుండా 180 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..