Google Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ అకౌంట్‌ గుల్లే..

|

Nov 06, 2022 | 7:54 AM

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు జరిగే స్టైల్‌ కూడా మారుతోంది. ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని ఖాతాల్లో డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లలోకి మాల్వేర్‌ను పంపించి చడీచప్పుడు కాకుండా ఖాతాల్లో డబ్బును కొట్టేస్తున్నారు...

Google Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ అకౌంట్‌ గుల్లే..
Google Apps
Follow us on

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు జరిగే స్టైల్‌ కూడా మారుతోంది. ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని ఖాతాల్లో డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లలోకి మాల్వేర్‌ను పంపించి చడీచప్పుడు కాకుండా ఖాతాల్లో డబ్బును కొట్టేస్తున్నారు. ఇలాంటి సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్‌ క్రిమినల్స్‌ ఎంచుకున్న కొత్త మార్గం యాప్‌ల ద్వారా మాల్వేర్‌లను పంపించడం. అయితే గూగుల్ ఇలాంటి యాప్‌లను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ యూజర్లను అలర్ట్‌ చేస్తుంది. ఫోన్‌లలో నుంచి యాప్‌లను డిలీట్‌ చేసుకోమని సూచిస్తుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి మాల్వేర్‌ను గుర్తించిన నాలుగు యాప్‌లను గూగుల్ తొలగించింది. తమ ఫోన్‌లలో ఈ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్‌ చేసుకోమని యూజర్లకు సైతం సమాచారం అందించింది. గూగుల్‌ ప్రకటించిన యాప్స్‌లో మై ఫైనాన్స్‌ ట్రాకర్‌, జెట్టర్‌ అథెంటికేటర్‌, రికవర్‌ ఆడియో, ఇమేజెస్‌ అండ్‌ వీడియో ఉన్నాయి. ఈ యాప్‌ల ద్వారా పంపించిన మాల్వేర్‌తో సైబర్‌ నేరస్థులు స్క్రీన్‌ రికార్డింగ్ ద్వారా యూజర్ల బ్యాంకింగ్‌ వివరాలను సేకరిస్తున్నట్లు థ్రెట్‌ ఫ్యాబ్రిక్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. వీటితోపాటు బ్లూటూత్‌ ఆటో కనెక్ట్, డ్రైవర్‌, బ్లూటూత్‌ యాప్‌ సెండర్‌, మొబైల్‌ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ల్లో కూడా మాల్వేర్‌ ఉన్నట్లు మాల్‌వేర్‌బైట్స్‌ ల్యాబ్స్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది.

ఇక ఈ మాల్వేర్‌తో సైబర్‌ క్రిమినల్స్‌ యూజర్లకు ఎలాంటి అనుమానం రాకుండా డౌన్‌లోడ్‌ చేసిన 72 గంటల తర్వాత ఈ యాప్‌లు మాల్‌వేర్‌ను వ్యాప్తిచేస్తున్నాయని గుర్తించారు. ఈ మాల్వేర్‌ మొబైల్‌ లాక్‌ మోడ్‌లో ఉన్నా ఫోన్‌ను ఆపరేట్‌ చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్‌లపై క్లిక్ చేస్తున్నట్లు మాల్‌వేర్‌బైట్స్‌ ల్యాబ్స్‌ తెలిపింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను ఫోన్ల నుంచి డిలీట్ చేయమని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..