Aliens: ఏలియన్స్ అక్కడ కూడా ఉన్నాయా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు..

|

Oct 23, 2021 | 6:50 AM

Aliens in Sea: ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వీటి మనుగడను తెలుసుకోవడం కోసం తీవ్రమైన వేట సాగిస్తున్నాయి ప్రపంచ దేశాలు.

Aliens: ఏలియన్స్ అక్కడ కూడా ఉన్నాయా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు..
Florida Scientist
Follow us on

Aliens in Sea: ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వీటి మనుగడను తెలుసుకోవడం కోసం తీవ్రమైన వేట సాగిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఏలియన్స్ కోసం విశ్వాంతరాలే కాదు.. సముద్రగర్భాలనూ వదలడం లేదు సైంటిస్టులు. ఆ క్రమంలోనే సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ సముద్రం లోతులో దాగున్న రహస్యాలను తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలో అనేక వింతలు, ఆశ్చర్యం కలిగించే విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇక తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో నీటి అడుగున ఉన్న 14రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సముద్రంలో 3వేల అడుగులు లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతుల లార్వాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ జీవులు ఏలియన్స్‌ రూపాన్ని కలిగి ఉన్నాయంటూ ఓ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు సైంటిస్టులు. ఈ జీవుల తలలపై కొమ్ములు ఉన్నాయని ఫ్లోరిడా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హీథర్ బ్రాకెన్-గ్రిస్సోమ్ వెల్లడించారు. నారింజ, నీలం రంగు వంటి వివిధ రకాలుగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ జీవులపై మరింత పరిశోధనలు చేయ్యాల్సిన అవసరం చాలా ఉందని తెలిపాడు. మరి భవిష్యత్‌లో వీటి గురించి ఏమైనా తేలుతుందా? అనేది వేచి చూడాలి.

Also read:

Farmers: పాపం రైతన్న.. జింక పేరు వింటే చాలు హడలిపోతున్నారు.. అంతలా భయపడటానికి కారణమేంటంటే..

Viral News: పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..