Fire-Boltt Combat Smartwatch: రఫ్ లుక్‌లో కేకపెట్టిస్తున్న స్మార్ట్ వాచ్.. తిరుగులేని ఫీచర్లు.. అతి తక్కువ ధరలోనే..

ఈ స్మార్ట్ వాచ్ సాలిడ్ లుక్ రఫ్ గా కనిపిస్తోంది. అత్యంత దృఢంగా, మిలటరీ గ్రేడ్ కఠినత్వంతో దీనిని తయారు చేశారు. దీనిలో దాదాపు 150 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.

Fire-Boltt Combat Smartwatch: రఫ్ లుక్‌లో కేకపెట్టిస్తున్న స్మార్ట్ వాచ్.. తిరుగులేని ఫీచర్లు.. అతి తక్కువ ధరలోనే..
Fire Boltt Combat Smart Watch

Updated on: Jul 04, 2023 | 6:00 PM

ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ లు అధికంగా మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. అన్ని కంపెనీలు విరివిగా స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. వినియోగదారులను నుంచి మంచి డిమాండ్ ఉండటంతో దిగ్గజ కంపెనీలతో పటు చిన్న చిన్న స్టార్టప్ లు కూడా స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఫైర్-బోల్ట్ మళ్లీ మరో సరికొత్త ఉత్పత్తిని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దానిపై పేరు ఫైర్ బోల్ట్ కాంబాట్. ఈ స్మార్ట్ వాచ్ సాలిడ్ లుక్ రఫ్ గా కనిపిస్తోంది. అత్యంత దృఢంగా, మిలటరీ గ్రేడ్ కఠినత్వంతో దీనిని తయారు చేశారు. దీనిలో దాదాపు 150 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. దీనిని చేతి మణికట్టుకు పెట్టుకుంటే దీనికి ఉండే రెండు బటన్ల సాయంతో మెనూలను చూడొచ్చు. మార్చుకోవచ్చు.

ఫైర్ బోల్ట్ కాంబాట్ ధర, లభ్యత..

ఫైర్ బోల్ట్ కాంబాట్ స్మార్ట్ వాచ్ లాంచింగ్ ధర రూ. 1,799గా ఉంది. నాలుగు రంగుల్లో లభ్యమవుతోంది. బ్లాక్, కెమో బ్లాక్, గ్రీన్, కెమో గ్రీన్ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఫైర్ బోల్ట్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయొచ్చు.

ఫైర్ బోల్ట్ కాంబాట్ స్పెసిఫికేషన్లు..

ఫైర్ బోల్ట్ కాంబాట్ స్మార్ట్ వాచ్ లో 1.95 అంగుళాల హెచ్ డీ స్క్రీన్ ఉంటుంది. దీనిలో 100 క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ కి సపోర్టు చేస్తుంది. దీనిలో బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్ ఉంటాయి. ఈ వాచ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్స్, మిలటరీ గ్రేడ్ కఠినత్వం ఉంటాయి. ఐపీ 68 రేటింగ్ ఉంది. కాల్ లాగ్స్, డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీని ఫోన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక బ్యాటరీ సామర్థ్యాన్ని చేస్తే సింగిల్ చార్జ్ పై 8రోజుల పాటు ఆగకుండా పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ని ఎనేబుల్ చేస్తే ఐదు రోజుల వరకూ చార్జింగ్ నిలబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఫైర్ బోల్ట్ కాంబాట్ హెల్త్ ఫీచర్లు..

ఈ స్మార్ట్ వాచ్ లో 150 వర్క్ అవుట్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. స్మార్ట్ హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్ మోనిటరింగ్, హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అంతేకా సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూసేకొనే వీలుంటుంది. క్యాలిక్యులేటర్, స్టాప్ వాచ్, సెడెంటరీ అలర్ట్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..