OFF Facebook Activity: ప్రస్తుతం మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రకటనల విషయంలోనూ మార్పులు వచ్చాయి. వినియోగదారుడు దేని గురించి వెతుకుతున్నాడో దానికి సంబంధించిన ప్రకటనలు ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి సంస్థలు. ఇందుకోసం కొన్ని వ్యాపార సంస్థలు ఫేస్‌బుక్‌ను కూడా ఉయోగించుకుంటున్నాయి. ఫేస్‌బుక్‌లోని కొన్ని టూల్స్ ఆధారంగా మీరు ఎలాంటి కంటెంట్ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారో దానికి సంబంధించిన ప్రకటనలను ఇస్తున్నారు. దీని వల్ల వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదూ.! అలా కాకుండా మీరు ఫేస్‌బుక్‌లో ఏం చూస్తున్నారో థార్డ్ పార్టీ యాప్‌లకే కాకుండా ఫేస్‌బుక్ కూడా తెలుసుకునే అవకాశం లేకుంటే భలే ఉంటుంది కదూ..! ఫేస్‌బుక్ ఇందుకోసమే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆఫ్-ఫేస్‌బుక్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..
ఆఫ్-ఫేస్ బుక్ ఫీచర్‌తో ఏఏ సంస్థలు మీకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ ఫీచర్‌తో వెబ్ సైట్లు, యాప్స్, ఇతర థర్డ్ పార్టీ టూల్స్ ఫేస్ బుక్ లో మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో కనిపెట్టలేవు. ఫేస్‌బుక్ సైతం మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో గుర్తించలేదు. అంతేకాకుండా మీరు ఫేస్‌బుక్ చూస్తున్నప్పుడు ప్రకటనలు కూడా రావు.
ఆఫ్-ఫేస్‌బుక్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా.. ఫేస్‌బుక్ సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్లాలి. అనంతరం సెట్టింగ్‌పై క్లిక్ చేసి.. “యువర్ ఫేస్ బుక్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత.. ఆఫ్ ఫేస్‌బుక్ యాక్టివిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని ద్వారా.. ఫేస్‌బుక్‌లో చూసిన కంటెంట్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు.
Also Read: Viral Video: ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
Actress Meena: సీనియర్ నటి మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వర్ బిఫోర్