Twitter Blue Ticks: మస్క్ మామతో అట్లుంటది మరి.. ట్విట్టర్‌లో బ్లూ టిక్‌ కావాలంటే నెల నెల చెల్లించుకోవల్సిందే.. ఎంతో తెలుసా

|

Nov 02, 2022 | 11:20 AM

సామాజిక మాధ్యమాల్లో దిగ్గజ సంస్థ.. ఇప్పటి వరకూ ట్విట్టర్ ఫర్ ఆల్.. ఏ ఫ్రీ సోషల్ మీడియా సర్వీస్. ఇకపై ట్విట్టర్ అంటే అదో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారనుందా? ట్వీట్ చేస్తే డబ్బు చెల్లించాల్సిందేనా? ట్విట్టర్ లో రానున్న మార్పు చేర్పులేంటి? అన్నిటికన్నా మించి ఎలాన్ మస్క్ కమర్షియల్ థింకింగ్ ఎలా ఉంది.

Twitter Blue Ticks: మస్క్ మామతో అట్లుంటది మరి.. ట్విట్టర్‌లో బ్లూ టిక్‌ కావాలంటే నెల నెల చెల్లించుకోవల్సిందే.. ఎంతో తెలుసా
Twitter Blue Ticks
Follow us on

ట్విట్టర్ ను సొంతం చేస్కున్న ఎలాన్ మస్క్.. ఈ డీల్ ను 44 బిలియన్ డాలర్లకు సెట్ చేయడం ఒక వార్త కాగా.. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్స్ పై వేటు వేయడం మరో హాట్ టాపిక్.. ఇకపై ట్వీట్ చేయాలంటేనే డబ్బు కట్టాల్సిందే అన్నది మరో చర్చనీయాంశంగా మారింది. ఇలా ట్విట్టర్‌లో ఎలోన్ చాలా నెలలుగా చర్చలో ఉన్న ట్విట్టర్ మరిన్ని రోజులు చర్చలో ఉండబోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో సహా టాప్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను కంపెనీ నుండి తొలగించగా.. ఇప్పుడు అదే వైపు, మస్క్ ట్విట్టర్‌లో బ్లూ టిక్ పొందిన వినియోగదారులకు షాక్ ఇచ్చాడు. మీ ట్విట్టర్‌లో బ్లూ టిక్ (వెరిఫైడ్) ఖాతా కూడా ఉంటే  మీరు ప్రతి నెలా దాదాపు రూ.660 చెల్లించాల్సి ఉంటుంది.

బేసిగ్గా కమర్షియల్ థాట్ ఎక్కువైన.. ప్రపంచ కుబేరుడు మస్క్.. ట్విట్టర్ ను కూడా కమర్షియలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మస్క్ దీనిపై ఒక హింట్ ఇచ్చారు కూడా. ఏప్రిల్ లో ట్విట్టర్ కొనుగోలు ప్రతిపాదన చేసిన మస్క్.. మే నాలుగున ఒక ట్వీట్ చేశారు. ట్విట్టర్ సాధారణ వినియోగదారులకు ఉచితమే కానీ.. ప్రభుత్వ, కమర్షియల్ యూజర్ల నుంచి కొంత మొత్తం వసూలు చేస్తామని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నెలకు 8 డాలర్లు, అంటే రూ. 661.73 కట్టాలి..

ఇప్పుడా మాటను నిజం చేస్తూ ప్రభుత్వ, వాణిజ్య వినియోగదారుల నుంచి కొంత మొత్తం యూజర్ చార్జీలు వసూలు చేయాలనుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. ఈ విధానం అమలు చేస్తే.. ఇలా చేసిన తొలి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఇదే అవుతుంది. ధృవీకరించబడిన ఖాతా వినియోగదారుల నుంచి సుమారు $ 20 అంటే సుమారు రూ. 1650 తీసుకోవాలనేది ట్విట్టర్ మునుపటి ప్రణాళిక అని చాలా కానీ ఈ ఫజు గురించి విన్నతర్వాత వినియోగదారులు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఈ ఫీజును $ 8కి తగ్గించారు ఎలాన్ మాస్క్. అంటే మన కరెన్సీలో ఇది రూ. 661.73 కట్టాల్సి ఉంటుంది.

భారత్‌లో 24 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఖాతాలు

ట్విట్టర్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, మన దేశంలో 24 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి. అదే సమయంలో, మేము అమెరికా గురించి మాట్లాడినట్లయితే, సుమారు 77 మిలియన్ల ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి మరియు జపాన్లో 58 మిలియన్ల క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. ఈ లెక్కలను బట్టి రానున్న రోజుల్లో ట్విటర్ ఎంత వసూళ్లు సాధిస్తుందో అంచనా వేయవచ్చు. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ని కొనుగోలు చేశాడు.

ఫక్తు కమర్షియల్ యాక్టివిటీ..

ట్విట్టర్ సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటి. భారత్ తో పాటు ఎన్నో దేశాల్లో.. అత్యంత ప్రజాదరణ ట్విట్టర్ సొంతం. సాధారణ స్థాయి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచీ ప్రపంచ స్థాయి రాజకీయ నాయకులు, కుబేరులు, ఇతర ప్రభుత్వ\ ప్రైవేటు రంగ సీఈఓలు, ఉన్నతాధికారులు.. ఇలా ఎందరో ట్విట్టర్ వేదికగా తమ సామాజిక- ఆర్ధిక- రాజకీయ కార్యకలాపాలు. ఇతర ప్రచారాలను కొనసాగిస్తున్నారు. కొందరు ఫక్తు కమర్షియల్ యాక్టివిటీస్ కి తమ ట్విట్టర్ అకౌంట్ ను వేదికగా చేసుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి కనీస మొత్తాన్ని వసూలు చేస్తే చాలు.. అది కంపెనీని లాభాల బాట పట్టిస్తుందని భావిస్తున్నారు ఎలెన్ మస్క్. అయితే ఇప్పటి వరకూ సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రకటనల్లేవు. కానీ మస్క్ దూకుడును బట్టీ చూస్తుంటే ఏదైనా జరగొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం