మన భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా ఎగిరే కార్లు రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో.. ఇండియా కూడా విదేశాలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్లైయింగ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వీటి కోసం భారతదేశంలోనూ ఓ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారట. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ చాలా పెద్దది. యూరప్ దేశాలకు కూడా మన దేశం నుంచి కార్లు ఎగుమతి అవుతాయి. అందుకే భారత్‌లో తొలి ఫ్లయింగ్ కారును తయారు చేయాలని నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ డిసైడైంది.
ఈ ఫ్లయింగ్ కారు పేరు పాల్-వీ (పర్సనల్ ఎయిర్ లాండ్ వెహికల్). దీని తయారీ కోసం గుజరాత్‌లో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారట. 2021నుంచీ కార్ల ఉత్పత్తి ప్లాన్ కొనసాగుతుందని వారు తెలిపారు. కాగా.. కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వంతో.. డీల్ కూడా కుదిరింది. అలాగే.. ప్లాంట్‌కి కావాల్సిన అన్ని సదుపాయాలూ అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
పాల్-వీ కార్లు రోడ్డుపై.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అదే గాల్లో అయితే.. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందట. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. అలాగే దీనికి రెండు ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేళ ఒక ఇంజిన్ దెబ్బతింటే.. మరో ఇంజిన్ ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నెదర్లాండ్స్ కంపెనీకి చెందిన తయారీదారులు పేర్కొన్నారు.
Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..
టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్
వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..