WhatsApp: వాట్సాప్‌ ఛానల్స్‌ చిరాకు పెడుతున్నాయా.? ఎలా హైడ్ చేయాలో తెలియడం లేదా.?

|

Oct 05, 2023 | 11:15 AM

'వాట్సాప్‌ ఛానెల్స్' పేరుతో తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్‌ సహాయంతో సెలబ్రిటీలు మొదలు పలు ప్రముఖ సంస్థల వరకు వాట్సాప్‌ ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛానెల్స్‌ సహాయంతో తమ అభిప్రాయాలను కానీ, తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను కానీ ప్రమోట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ ఫీచర్‌కు యూజర్ల...

WhatsApp: వాట్సాప్‌ ఛానల్స్‌ చిరాకు పెడుతున్నాయా.? ఎలా హైడ్ చేయాలో తెలియడం లేదా.?
Whatsapp Channel
Follow us on

మారుతోన్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది వాట్సాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోందీ కాబట్టే ఈ మెసేజింగ్‌ యాప్‌కు ఇంతటీ ఫాలోయింగ్ ఉంది. టెక్‌ మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియాలో సైట్స్ నుంచి వస్తున్న పోటీ తట్టుకునే క్రమంలోనే వాట్సాప్‌ ఛానెల్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

‘వాట్సాప్‌ ఛానెల్స్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్‌ సహాయంతో సెలబ్రిటీలు మొదలు పలు ప్రముఖ సంస్థల వరకు వాట్సాప్‌ ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛానెల్స్‌ సహాయంతో తమ అభిప్రాయాలను కానీ, తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను కానీ ప్రమోట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ ఫీచర్‌కు యూజర్ల నుంచి కూడా ఆదరణ లభస్తోంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ కొందరికి మాత్రం చిరాకు తెచ్చి పెడుతోంది. పర్సనల్‌ చాట్స్‌ చేసుకునే చోట ఈ ఛానెల్స్‌ గొడవ ఏంటనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ ఛానెల్స్‌తో చిరాకు పడుతోన్న వారికి ఉపశమనం కలిపించేందుకు వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌తో ఇబ్బంది పడుతోన్న వారికి సదరు ఫీచర్‌ను హైడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వాట్సాప్‌ ఛానల్స్‌ ఫీచర్‌ను హైడ్‌ చేయడం కోసం ముందుగా.. వాట్సాప్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘అప్‌డేట్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేస్తే ఛానల్స్‌ కనిపిస్తాయి. అయితే మీ వాట్సాప్‌లో ఒకవేళ సరిపడ స్టేటస్‌లు ఉంటే ఆటోమెటిగ్‌గా ఛానెల్స్‌ చివరికి వెళ్లిపోతాయి. దీంతో మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే మళ్లీ వాట్సాప్‌ ఓపెన్‌చేసి ప్రతీసారి ఛానల్స్‌ కనిపిస్తాయి. ఇది కూడా తలనొప్పితో కూడుకున్న వ్యవహారంలా ఉందని శాశ్వతంగా ఛానల్స్‌ను హైడ్‌ చేసే అవకాశం ఉంటే బాగుటుందని యూజర్లు భావిస్తున్నారు. అయితే దీనిపై వాట్సాప్‌ ఏదైనా అప్‌డేట్ ఇస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఛానల్స్‌ కనిపించకుండా చేయడానికి మరో ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయకుండా ఉన్నట్లైనా ఛానెల్స్‌ కనిపించవు. పాత వెర్షన్‌ను వినియోగించుకోవడం ద్వారా ఛానెల్స్‌ గొడవ లేకుండా ఉండొచ్చు. చాట్స్‌ను బ్యాకప్ చేసుకొని, కొత్త వెర్షన్‌ స్థానంలో మళ్లీ పాత వెర్షన్‌ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..