Whatsapp Chats: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందులో వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ప్రతి ఒక్కరి వాట్సాప్‌లో కుప్పలు తెప్పలుగా ఫోటోలు, వీడియోలు వచ్చి చేరుతుంటాయి. అయితే దీని వల్ల స్టోరేజీ పెరిగిపోతుంటుంది. అప్పుడప్పుడు పొరపాటున వాట్సాప్ డేటా డిలీట్ అవుతుంటుంది. అలాంటి సమయంలో కంగారు పడుతుంటారు. కానీ డేటా డిలీట్ అయిపోతే కంగారు పడాల్సి అవసరం ఉండదు. సింపుల్ టెక్నాలజీతో డిలీట్ అయిన వాట్సాప్ డేటాను తిరిగి పొందవచ్చు.
డేటా బ్యాకప్ కు గూగుల్ డ్రైవ్
వాట్సాప్ నుంచి డిలీట్ అయిన డేటాను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మీ వాట్సాప్ డేటా బ్యాకప్ తీసుకోవాలి. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అందులో చాట్ అనే ఆప్షన్‌ను ఎంచుకొని బ్యాకప్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ డేటా బ్యాకప్ తీసుకోవాలంటే గూగుల్ డ్రైవ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గూగుల్ డ్రైవ్‌లో ఓ ఫోల్డర్‌ను క్రియేట్ చేసుకుని బ్యాక్ ఆఫ్ ఆప్షన్ ద్వారా డిలీట్ అయిన డేటా మొత్తం స్టోర్ అయిపోతుంది.
ఇంకో విషయం ఏంటంటే గూగుల్ డ్రైవ్‌లో డిలీట్ అయిన మీ వాట్సాప్ డేటా స్టోర్ కావాలంటే గూగుల్ డ్రైవ్‌లో మీ వాట్సాప్ డేటా డీఫాల్ట్‌గా స్టోర్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మీరు అటోమేటిగ్‌గా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్‌లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కొత్త కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇవి కూడా చదవండి: