Honor V Purse: చూడ్డానికి పర్సులా కనిపిస్తోన్న ఈ గ్యాడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. మడత పెట్టేయొచ్చు..

|

Sep 24, 2023 | 8:56 AM

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌ ఓ అడుగు ముందుకేసి మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హానర్‌ వీ పర్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రస్తుతం చైనాలో లాంచ్‌ చేయగా గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పేరుకు తగ్గుట్లుగానే ఈ ఫోన్‌ అచ్చంగా పర్స్‌ను పోలి ఉండడం విశేషం. ఈ ఫోన్‌కి చైన్‌ని తగిలించి ఎంచక్కా...

Honor V Purse: చూడ్డానికి పర్సులా కనిపిస్తోన్న ఈ గ్యాడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. మడత పెట్టేయొచ్చు..
Honor V Purse
Follow us on

మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ల తయారీల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఫోన్‌లోపల ఫీచర్లకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఫోన్‌ డిజైన్‌కు సైతం అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. విభిన్న రకాల మోడల్స్‌లో ఫోన్‌లను రూపొందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుబాటులోకి వస్తున్నవే ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్స్‌.

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌ ఓ అడుగు ముందుకేసి మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హానర్‌ వీ పర్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రస్తుతం చైనాలో లాంచ్‌ చేయగా గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పేరుకు తగ్గుట్లుగానే ఈ ఫోన్‌ అచ్చంగా పర్స్‌ను పోలి ఉండడం విశేషం. ఈ ఫోన్‌కి చైన్‌ని తగిలించి ఎంచక్కా పర్సులా వాడొచ్చు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర మన కరెన్సీలో రూ. 68,400గా ఉండగా, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 75,300గా ఉండనుంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 7.71 ఇంచెస్‌తో కూడిన ఓటర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే ఫోల్డ్‌ చేసిన తర్వాత 6.45 ఇంచెస్‌ ప్యానెల్‌గా స్క్రీన్‌ మారుతుంది. అవుటర్‌ డిస్‌ప్లేను మనం ధరించిన దుస్తుల కలర్స్‌కు అనుగుణంగా మార్చుకోవచ్చు దీంతో చూస్తున్న వారికి అచ్చంగా పర్సును క్యారీ చేస్తున్న భావనే కలుగుతుంది. ఇక ఈ డిస్‌ప్లే 1600 నిట్‌ల మ్యాగ్జీమమం బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 16 జీబీ ర్యామ్‌ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌+12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 9 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే 35 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే సైడ్ మైంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను అందించారు. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ఎప్పుడు లాంచ్ చేయనున్నారన్న దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..