విజయవంతంగా పూర్తయిన చైనా చాంగే-5 మిషన్.. చంద్రునిపై ఉన్న రాళ్లు, మట్టిని తీసుకొచ్చిన అంత‌రిక్ష నౌక.

|

Dec 17, 2020 | 4:02 PM

అంత‌రిక్ష రంగంలో చైనా మరో ముందడుగు వేసింది. జాబిల్లిపై జరుగుతోన్న పరిశోధనల్లో చైనా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రునిపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించే ఉద్దేశంతో ప్రయోగించిన చైనా మానవ రహిత అంత‌రిక్ష నౌక గురువారం విజయవంతంగా భూమికి చేరుకుంది.

విజయవంతంగా పూర్తయిన చైనా చాంగే-5 మిషన్.. చంద్రునిపై ఉన్న రాళ్లు, మట్టిని తీసుకొచ్చిన అంత‌రిక్ష నౌక.
Follow us on

China’s Chang’e 5 capsule lands on Earth: అంత‌రిక్ష రంగంలో చైనా మరో ముందడుగు వేసింది. జాబిల్లిపై జరుగుతోన్న పరిశోధనల్లో చైనా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రునిపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించే ఉద్దేశంతో ప్రయోగించిన చైనా మానవ రహిత అంత‌రిక్ష నౌక గురువారం విజయవంతంగా భూమికి చేరుకుంది. నవంబర్ 23న ‘లాంగ్ మార్చ్ 5’ రాకెట్ ద్వారా చాంగే-5 మిషన్‌ను చైనా ప్రయోగించింది. చంద్రుడిపై నమూనాలను ఒక క్యాప్సల్‌లో భూమిపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే చాంగే-5 అంత‌రిక్ష నౌక ఉత్తర చైనాలోని మంగోలియా ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.


ఈ ప్రయోగం విజయంతం కావడంతో భూమిపైకి చంద్రుడి నమూనాలను తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లలో చంద్రుడిపై నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా, సొవియేట్ యూనియన్ 1960,1970లో చంద్రునిపై నుంచి నమూనాలను సేకరించిన మొదటి రెండు దేశాలుగా నిలిచాయి. అమెరికా ఈ ప్రయోగం నిర్వహించిన సమయంలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తమ దేశ జెండాను జాబిల్లిపై ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఘనత సాధించిన దేశంగా చైనా నిలిచింది. చైనా స్పేస్ క్రాఫ్ట్ డిసెంబర్ 1న చంద్రునిపై ల్యాండ్ అయింది. అనంతరం ఈ మానవ రహిత వ్యోమనౌక తమ జాతీయా జెండాను జాబిల్లిపై పాతింది.