Car Care: మీకు సొంత కారు ఉందా? లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తారా? అయితే, ఇవి తప్పక తెలుసుకోండి..

|

May 06, 2023 | 11:54 AM

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. వాహనదారులు తమ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా సొంత కారు ఉన్నవారు తమ కారుపై కాస్త శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. టైర్లు, ఫ్లూయిడ్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సహా కారులోని అనేక విభాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో వాహనం మంచి కండీషన్‌లో ఉండటానికి

Car Care: మీకు సొంత కారు ఉందా? లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తారా? అయితే, ఇవి తప్పక తెలుసుకోండి..
Car Care Tips
Follow us on

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. వాహనదారులు తమ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా సొంత కారు ఉన్నవారు తమ కారుపై కాస్త శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. టైర్లు, ఫ్లూయిడ్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సహా కారులోని అనేక విభాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో వాహనం మంచి కండీషన్‌లో ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంధన సామర్థ్యం తగ్గుదల, బ్రేక్ డౌన్ వంటి వాటిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వేసవిలో కారు సంరక్షణ కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీకోసం..

విండ్ షీల్డ్ వైపర్‌లను చెక్ చేయాలి..

వేసవి కాలంలో విండ్ షీల్డ్ వైపర్‌లను జాగ్రత్తగా చూసుకోవాలి. దుమ్ము, కాలుష్యం, సూర్యకిరణాల కారణంగా గ్లాస్ అస్పష్టంగా కనిపిస్తుంది. అందుకే.. విండ్ షీల్డ్‌ను, వైపర్‌ను సరిగా ఉంచుకోవాలి. ఏమైనా తేడా ఉంటే కొత్తవి మార్చుకోవాలి.

ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి..

వేసవి నెలల్లో క్యాబిన్‌లోకి వెంట్స్ ద్వారా హానికరమైన కాలుష్య కారకాలు ప్రవేశించకుండా నిరోధించడంలో మీ కారు ఎయిర్ ఫిల్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, పాడైపోయిన, మురికి పట్టిన ఫిల్టర్ కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్‌ను చేక్ చేస్తుండాలి.

ఇవి కూడా చదవండి

టైర్‌, గాలి చెక్ చేస్తుండాలి..

వాతావరణంతో సంబంధం లేకుండా కారు పనితీరు మెరుగ్గా ఉండేందుకు.. టైర్లలో గాలి సరైన మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతల కారణంగా కొన్నిసార్లు టైర్లలో గాలి తగ్గడం గానీ, టైర్ మెత్తగా అవడం గానీ జరుగుతంది. అందుకే టైర్ల నిర్వహణ జరిగా చూసుకోవాలి.

ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి..

వేసవిలో ఉష్ణోగ్రత కారణంగా కారులోని ఇంజిన్ ఆయిల్ త్వరగా చెడిపోతుంది. దీనివల్ల ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే.. అలా జరుగకుండా ఉండాలంటే.. ఇంజిన్ ఆయిల్ స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేస్తుండాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..