Samsung Galaxy S23: సామ్‌సంగ్ ఎస్23 ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.50 వేల తగ్గింపు

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. ఇటీవల మంచి ఫీచర్స్‌తో వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్‌కు సంబంధించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్-23పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Samsung Galaxy S23: సామ్‌సంగ్ ఎస్23 ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.50 వేల తగ్గింపు
Samsung Galaxy S23

Updated on: Mar 09, 2025 | 5:06 PM

ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారిని వారి బడ్జెట్ కొంత ఆలోచనల్లో పడేస్తుంది.  ఇలాంటి వారు సామ్‌సంగ్ సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా ఈ ఫోన్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.95,999గా ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 56 శాతం భారీ తగ్గింపు తర్వాత కేవలం రూ.41,999కే లభిస్తుంది. అంటే దాదాపు సగం ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 

అలాగే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ. 750 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకున్నప్పుడు దాదాపు రూ.39,150 వరకు తగ్గింపు వస్తుంది. మీ పాత ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 ఎక్స్ఛేంజ్ వాల్యూ కడితే ఈ ఫోన్‌ను కేవలం రూ.26,999కే పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ స్పెసిఫికేషన్లు

  • ప్రీమియం బిల్డ్ డిజైన్‌తో పాటు ఐపీ68 ద్వారా నీరు, ధూళి నిరోధకతతో అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. 
  • 6.1 అంగుళాల డైనమిక్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+,, 1750 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • శక్తివంతమైన పనితీరులో ఈ ఫోన్‌కు సాటి లేదు. సున్నితమైన మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్.
  • 8 జీబీ + 256 జీబీ, 8 జీబీ + 512 జీబీ వేరియంట్స్ 
  • 12 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 50ఎంపీ+ 10ఎంపీ+ 12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.
  • 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3900 ఎంఏహెచ్ 
  • సామ్‌సంగ్ వన్ యూఐతో ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో పని చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి