Amazon Sale: అమెజాన్‌‌లో ఫ్రిడ్జ్‌లపై బంపర్‌ ఆఫర్‌… ఏకంగా 40 శాతం తగ్గింపు

మెగా సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై మీరు గణనీయమైన ధర తగ్గింపులను మాత్రమే కాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఇతర కూపన్ డిస్కౌంట్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు మీ రిఫ్రిజిరేటర్‌ని రీప్లేస్ చేయాలనుకుంటుంటే అద్భుతమైన ఆఫర్‌లను పొందేందుకు, కొంత అదనపు డబ్బును ఆదా చేసుకోవడానికి ఇది మంచి సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా రిఫ్రిజిరేటర్‌లు అధిక డిస్కౌంట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి.

Amazon Sale: అమెజాన్‌‌లో ఫ్రిడ్జ్‌లపై బంపర్‌ ఆఫర్‌… ఏకంగా 40 శాతం తగ్గింపు
Online Shopping

Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 9:20 PM

ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హవా నడుస్తుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ మెగా సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై మీరు గణనీయమైన ధర తగ్గింపులను మాత్రమే కాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఇతర కూపన్ డిస్కౌంట్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు మీ రిఫ్రిజిరేటర్‌ని రీప్లేస్ చేయాలనుకుంటుంటే అద్భుతమైన ఆఫర్‌లను పొందేందుకు, కొంత అదనపు డబ్బును ఆదా చేసుకోవడానికి ఇది మంచి సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా రిఫ్రిజిరేటర్‌లు అధిక డిస్కౌంట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ సీజన్‌లో కొనుగోలు చేయడానికి విలువైన రిఫ్రిజిరేటర్‌ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

గ్రోదేజ్‌ 202 లీటర్ల 5 స్టార్‌ఫ్రిజ్‌

2023 మోడల్‌కు చెందిన ఆర్‌డీ 210ఈ టీడీఐ ఎంఎన్‌ బీఎల్‌ మెరైన్ బ్లూ ఫ్రిజ్‌ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ నిశ్శబ్దంగా ఉండటమే కాకుండా రిఫ్రిజిరేటర్ ఆపరేషన్ ఆధారంగా శీతలీకరణను డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది.  ఆహార సామర్థ్యం 185.5 లీటర్లుగా ఉంటుంది. ఈ ఫ్రిజ్‌ ధర రూ.17,499. 

వోల్టాస్‌ బెకో 183 లీటర్ల 5 స్టార్‌ ఫ్రిజ్‌

వోల్టాస్‌ బెకో 183 లీటర్ల 5 స్టార్‌ ఫ్రిజ్‌ ధర రూ.15,490కు ఈ ఆఫర్‌ సమయంలో వస్తుంది. ఫ్లెయిరీ ఫ్లవర్‌ లుక్‌తో వచ్చే ఈ ఫ్రిజ్‌ అందిరినీ ఆకట్టకుంటుంది. ఈ ఫ్రిడ్జ్‌ అడ్జస్టబుల్ టఫ్నెడ్ గ్లాస్ షెల్వ్స్, బేస్ డ్రాయర్, ఫ్లెక్స్ లిఫ్ట్ డోర్ షెల్ఫ్, చిల్లర్ ట్రేతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్‌ 236 లీటర్స్‌ ఫ్రిజ్‌

సామ్‌సంగ్‌ నుంచి వచ్చే ఆర్‌టీ ఆర్‌28సీ3733ఎస్‌8/హెచ్‌ఎల్‌ ఫ్రిజ్‌ సిల్వర్, సొగసైన ఐనాక్స్ 2023 మోడల్‌గా నిలుస్తుంది. ఈ ఫ్రిజ్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఎంపికతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఇతర కార్డ్‌ల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్రిజ్‌ ఈ సేల్‌లో కొనుగోలు చేస్తే ఉచితంగా  ఒక సంవత్సరం పాటు ఎక్స్‌టెండెడ్‌ వారెంటీను పొందవచ్చు. ఈ ఫ్రిజ్‌లో శక్తివంతమైన శీతలీకరణతో కలిపి ఆటోమేటిక్ డీఫ్రాస్టింగ్‌ను అనుభవించవచ్చు. దీర్ఘకాలిక తాజాదనం, పనితీరును నిర్ధారిస్తుంది. వివిధ కన్వర్టిబుల్ మోడ్‌లతో మీ స్టోరేజ్ స్పేస్‌ను పెంంచుకోవచ్చు. ఈ ఫ్రిజ్‌ ధర రూ.26,490గా ఉంటుంది.

వర్ల్‌ఫూల్‌ 240 లీటర్ల ఫ్రిజ్‌

వర్ల్‌ఫూల్‌ కంపెనీ నుంచి వచ్చే ఎఫ్‌పీ 263డీ ప్రోటాన్ రాయ్ ఫ్రిజ్‌ జర్మన్ స్టీల్‌తో తయారు చేశారు. ఈ ఫ్రిజ్‌ ఈ సేల్‌లో రూ.24,990కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్రిజ్‌ కొత్త ప్రోటాన్ వరల్డ్ సిరీస్ సీఎఫ్‌ఎల్‌ స్టార్‌ కంటే తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇది దాని తరగతిలోని అత్యంత శక్తి-సమర్థవంతమైన రిఫ్రిజిరేటర్‌లలో ఒకటిగా నిలిచింది. జియోలైట్ టెక్నాలజీ, మాయిశ్చర్ రిటెన్షన్ టెక్నాలజీ, ఫ్రూట్ క్రిస్పర్, డెలి జోన్, 32 లీటర్ల పెద్ద నిల్వ, ఎయిర్ బూస్టర్, ఎనర్జీ ఎఫిషియెన్సీతో పని చేస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..