వినియోగదారులను అమితంగా ఆకర్షించిన గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 7 ఏ లాంచ్ అవుతున్న తరుణంలో ఇప్పటికే కంపెనీ పిక్సెల్ 6 ఏ ఫోన్‌ను అధికారికంగా రూ.12000 తగ్గింపుతో అందిస్తుంది. అంటే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.43,999గా ఉంటే ఇప్పుడు అధికారికంగా రూ.31,999కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో జరుగుతున్న ప్రత్యేక సేల్లో ఈ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. 6 జీబీ+128 జీబీ వెర్షన్లతో వచ్చే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ రూ.30,999కు అందుబాటులో ఉంటుంది. అయితే మిగిలిన తగ్గింపును ఎలా పొందవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొన్ని ఫోన్స్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ జాబితా గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ కూడా ఉంది. అలాగే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.27,250 వరకూ తగ్గింపు పొందవచ్చు. బ్యాంకు ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ రెండు కలిపి ఈ ఫోన్‌పై రూ.3749 ధరకు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్‌పై తగ్గింపు అనేది ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. మొత్తం మీద మీ ఫోన్ స్థితిపై ఆధారపడి గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ రూ.3749కే మీ చేతికి వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..