Washing Machines: అందరికీ అందుబాటు ధరల్లో ఉండే వాషింగ్ మెషీన్స్ ఇవే.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..

|

Feb 02, 2023 | 12:52 PM

వాషింగ్ మెషీన్ ధరలతో సమస్యంతా వస్తుందని మధ్యతరగతి వారు బాధపడుతుంటారు. మంచి కంపెనీ, ఫీచర్స్ ఉన్న వాషింగ్ మెషీన్ పై ఆశ ఉన్నా డబ్బులు దృష్ట్యా రాజీ పడాల్సి వస్తుందని ఫీల్ అవుతుంటారు.

Washing Machines: అందరికీ అందుబాటు ధరల్లో ఉండే వాషింగ్ మెషీన్స్ ఇవే.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..
Washing Machine
Follow us on

ఆడవాళ్లు చేసే పనుల్లో బట్టలు ఉతకడమే పెద్ద పనిగా వారు భావిస్తారు. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని వచ్చే సమస్యల కారణంగా బట్టలు ఉతుక్కోలేకపోతున్నారు. దీంతో చాలా మంది వాషింగ్ మెషీన్లను ఆశ్రయిస్తున్నారు. మొదట్లో పట్టణ ప్రాంతంలోని ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడిన ఈ మెషీన్లు కాలక్రమేణ గ్రామాల్లో కూడా విస్తరించాయి. దీంతో కంపెనీలు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వాషింగ్ మెషీన్లను డిజైన్ చేస్తున్నారు. అయితే వాషింగ్ మెషీన్ ధరలతో సమస్యంతా వస్తుందని మధ్యతరగతి వారు బాధపడుతుంటారు. మంచి కంపెనీ, ఫీచర్స్ ఉన్న వాషింగ్ మెషీన్ పై ఆశ ఉన్నా డబ్బులు దృష్ట్యా రాజీ పడాల్సి వస్తుందని ఫీల్ అవుతుంటారు. మీ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. యూజర్ ఫ్రెండ్లీ ఆప్సన్స్ తో పాటు అధిక ఫీచర్లు ఉండే వాషింగ్ మెషీన్ల పై ఓ లుక్కేద్దాం.

ఒనిడా 7 కేజీల టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

5 స్టార్ రేటింగ్ వచ్చే ఈ వాషింగ్ మెషీన్ అందుబాటు ధరలో అధిక ఫీచర్లతో వస్తుంది. చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు సరిపోతుంది. 7 కిలోల కెపాసిటీతో ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ గా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే యాంటీ రస్ట్ బాడీ, ఒన్ టచ్ ఆటోమెటిక్ ఆపరేషన్, క్రిస్టల్ డ్రమ్ టెక్నాలజీతో వస్తుంది. హెవీ, స్పిన్, రిన్స్, క్విక్ వాష్, సాధారణ వాష్ వంటి పీచర్లతో వస్తుంది. 

ప్యానాసోనిక్ 6.5 కేజీల టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

సెమీ ఆటోమెటిక్ ఫీచర్ తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇందులో రకరకాల వాషింగ్ మోడ్ లు ఉన్నాయి. ముఖ్యంగా రష్ ఫ్రీ మోడ్ తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే లింట్ పిల్టర్ తో ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

గోద్రేజ్ 6 కిలోల వాషింగ్ మెషీన్

పూర్తిగా ఆటోమెటిక్ ఫీచర్ తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ చిన్న కుటుంబాలకు సరైన ఎంపిక. అలాగే కరెంట్ కూడా తక్కువ ఖర్చయ్యే ఈ వాషింగ్ మెషీన్ నిర్వహణ కూడా సులువే. 6 పల్సేటర్, టబ్ క్లీన్ ఫీచర్, టఫ్డ్ గ్లాస్ డోర్, యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్ ప్యానెల్ ఈ వాషింగ్ మెషీన్ ప్రత్యేకతలు. 

సామ్ సంగ్ 8.5 కిలోల టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

సెమి ఆటోమెటిక్ ఫీచర్ తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ కు 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇందులో ఉండే రెండు వేర్వేరు టబ్ ల వల్ల సాధారణ వాషింగ్ మెషీన్ల కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే ఈ వాషింగ్ మెషీన్ యాంటీ రస్ట్ బాడీతో పాటు మ్యాజిక్ ఫిల్టర్ తో వస్తుంది. 

ఎల్జీ 7 కిలోల వాషింగ్ మెషీన్ 

ఫుల్లీ ఆటోమెటిక్ ఫీచర్ తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే 5 స్టార్ రేటింగ్ తో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇన్వెర్టర్ టెక్నాలజీ, టర్బో డ్రమ్ ఫీచర్ తో వస్తుంది. బట్టలను ఏ మాత్రం డ్యామెజ్ లేకుండా ఉతుకుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

మరి ఇంకెందుకు ఆలస్యం మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉన్న ఈ వాషింగ్ మెషీన్లను ఓ సారి చూసి, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్స్ లో కొనండి మరి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..