Fire-Boltt Apollo: ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. అతి తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు..

|

Jun 24, 2023 | 5:00 PM

తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఇక సెర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ని మన దేశంలో లాంచ్ చేసింది. దీనిపేరు ఫైర్-బోల్ట్ అపోల్లో2. సూపర్ ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ సొంతం.

Fire-Boltt Apollo: ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. అతి తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు..
fire Boltt Apollo 2 Smartwatch
Follow us on

తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఇక సెర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ని మన దేశంలో లాంచ్ చేసింది. దీనిపేరు ఫైర్-బోల్ట్ అపోల్లో2. చవకైన ధరలోనే అత్యాధునిక ఫీచర్లను దీనిలో అందించింది. 1.43 అంగుళాల డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, 100 స్పోర్ట్స్ మోడ్లు వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫైర్-బోల్ట్ అపోల్లో 2 ధర, లభ్యత..

ఫైర్-బోల్ట్ అపోల్లో 2 స్మార్ట్ వాచ్ లాంచింగ్ ఆఫర్ కింద రూ. 2,499కి లభిస్తోంది. ప్రస్తుతం ఫైర్-బోల్ట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో ఇది అమ్మకానికి ఉంది. పింక్ డార్క్ గ్రే, గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఫైర్-బోల్ట్ అపోల్లో 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఫైర్-బోల్ట్ అపోల్లో 2 స్మార్ట్ వాచ్ సర్కులర్ ప్యానల్ తో వస్తుంది. మెటాలిక్ బాడీ, సిలికాన్ స్ట్రాప్స్ ఉంటాయి. దీనిలో 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే 466×466 పిక్సల్ రిజల్యూషన్ తో ఉంటుంది. దీనిలో ఇన్ బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. తద్వారా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఇక హెల్త్ ఫీచర్లను పరిశీలిస్తే రక్తంలోని ఆక్సిజన్ లెవెన్స్ ని మోనిటర్ చేస్తుంది. హార్ట్ రేట్, పల్స్ రేట్, మహిళల రుతుచక్రం, నిద్ర మోనిటరింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిలో 110 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఇవి మీరు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండులాగున సాయపడతాయి. ఐపీ67 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే వారం పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇతర ఫీచర్లు..

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే వివిధ రకాల వాచ్ ఫేసేస్ ఉంటాయి. ఇన్ బిల్ట్ గేమ్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ నోటిఫికేషన్స్ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. అతి తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు కావాలనుకొనేవారికి ఈ స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..