- Telugu News Photo Gallery Technology photos Noise launches new ear buds noise buds vs103 features and price
Noise Buds VS103: నాయిన్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ నాయిస్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. నాయిస్ బడ్స్ వీఎస్ 103 పేరుతో లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్లతో లాంచ్ చేశారు. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jun 24, 2023 | 6:47 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. నాయిస్‌బడ్స్ VS103 పేరుతో ఈ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ ఇయర్‌బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి.

నాయిస్ బడ్స్ వీఎస్103 ఇయర్‌బడ్స్‌లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 150 నిమిషాల వరకు పనిచేయడం దీని ప్రత్యేకత. ఫుల్ ఛార్జ్ చేస్తే 40 గంటల ప్లేబ్యాక్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ఇయర్ బడ్స్‌లో 10 ఎమ్‌ఎమ్ డ్రైవర్‌లను అందించారు. జెట్ బ్లాక్, ఐవరీ వైట్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ ధర రూ. 2,099గా ఉంది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో ఈ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.2 సపోర్ట్‌తో పని చేస్తుంది. 10 మీటర్ల వరకు బ్లూటూత్ రేంజ్ దీని సొంతం.

బయటి శబ్ధాలు వినిపించకుండా 25dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌ను అందించారు. అలాగే వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX5 సర్టిఫికెట్ ఇచ్చారు. గేమ్ మోడ్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు సపోర్ట్ వంటి ఫీచర్లు వీటి ప్రత్యేకత.





























