BSNL broadband: తగ్గేదే లే అంటున్న బీఎస్ఎన్ఎల్.. రూ. 49 నుంచి ఓటీటీ ప్లాన్స్.. హాట్ స్టార్, సోని లివ్ మరెన్నో..

|

May 18, 2023 | 6:00 PM

వినియోగదారుల అభిరుచిని పసిగట్టిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అతి తక్కువ ధరలో కొత్త ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాన్లను ప్రవేశపెట్టింది. సినిమాప్లస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. వీటిల్లో అన్ని దాదాపు అన్ని ప్రముఖ ఓటీటీలను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

BSNL broadband: తగ్గేదే లే అంటున్న బీఎస్ఎన్ఎల్.. రూ. 49 నుంచి ఓటీటీ ప్లాన్స్.. హాట్ స్టార్, సోని లివ్ మరెన్నో..
Bsnl
Follow us on

ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ కాలం. స్మార్ట్ టీవీల రాకతో వినియోగదారుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కేబుల్ నెట్ వర్క్ పెట్టుకునే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. అన్ని చానళ్లకు ఓటీటీ యాప్ లుఉంటున్నాయి. ఇంటర్నెట్ ఉంటే చాలు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీంతో అందరూ మంచి బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ అది కూడా ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉండే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచిని పసిగట్టిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అతి తక్కువ ధరలో కొత్త ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాన్లను ప్రవేశపెట్టింది. సినిమాప్లస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. వీటిల్లో అన్ని దాదాపు అన్ని ప్రముఖ ఓటీటీలను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మూడు రకాల ఆఫర్లు..

బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్ సినిమా ప్లస్ ను లయన్స్ గేట్, షీమారూమీ, హంగమా, ఎపిక్ ఆన్ వంటి వాటితో కలసి అధిక ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్‌ మూడురకాల ప్యాక్స్ ఆఫర్ చేస్తోంది. ఫైబర్ కనెక్షన్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీద ఈ ఓటీటీ ప్యాక్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ నెట్ బిల్లులో ఛార్జ్ చేస్తారు. ఇందులో స్టార్టర్ ప్యాక్, ఫుల్ ప్యాక్, ప్రీమియం ప్యాక్ అని మూడు రకాలు ఉన్నాయి.

రూ.49కే బేస్ ప్యాక్.. ఈ బేస్ ప్యాక్ ద్వ్రా ప్రీమియం ఇండియన్ ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలను కలిగిన లయన్స్ గేట్, హంగామా, షెమారూ, ఎపికాన్ ఓటీటీ యాప్స్ లభిస్తాయి. గతంలో ఈ ప్యాక్ ధర రూ.99గా ఉండేది.

ఇవి కూడా చదవండి

రూ.199 ఫుల్ ప్యాక్.. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఫుల్ ప్యాక్ కేవలం రూ.199కే అందిస్తోంది. దీని ద్వారా జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యప్ టీవీ యాప్స్ వంటివి పొందవచ్చు.

సినిమా ప్లస్ ప్రీమియం ప్యాక్.. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్రీమీయం ప్యాక్ ధర రూ.249గా ఉంది. దీని ద్వారా సోనీ లివ్ ప్రీమియం, జీ5 ప్రీమియం, యప్ టీవీ, హంగామా, షెమారూ, లయన్స్ గేట్, హాట్ స్టార్ వంటి ఓటీటీలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్యాక్ ద్వారా 300లకుపైగా లైవ్ టీవీ ఛానల్స్, 500లకుపైగా టీవీ షోలు, 8000పైగా సినిమాలు చూసే అవకాశం లభిస్తోంది.

  • స్కోప్ విడియో యాప్ ద్వారా కంప్యూటర్, ల్యాప్‌‌టాప్, మొబైల్, ఐపాడ్, ట్యాబ్లెట్, స్మార్ట్ టీవీ వంటి వాటిల్లోనూ ఓటీటీ కంటెంట్ చూడవచ్చు. వీటిల్లో సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ ప్లాన్ ఉంది. రూ.999 ప్లాన్‌తో 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా 300లకుపైగా లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు.

ఎలా వినియోగించాలి.. ఈ సినిమా ప్లస్ ప్లాన్లను వినియోగించాలంటే మొదటిగా వారికి యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ ఉండాలి. ఆ తర్వాత వినియోగదారులకు అవసరం అయిన పాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..