BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌… ఎయిర్‌ టెల్‌, జియో కంటే మెరుగైన ఆఫర్‌.. రూ.108 రీచార్జ్‌తో..

|

Apr 04, 2021 | 3:42 PM

BSNL New Offer: ఒకప్పుడు టెలికామ్‌ రంగంలో ఓ వెలుగు వెలిగింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. దేశానికి తొలిసారి ఫోన్‌ను పరిచయం చేసింది ఈ కంపెనీనే. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ కనెక్షన్‌ రావాలంటే కనీసం మూడు నెలలు..

BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌... ఎయిర్‌ టెల్‌, జియో కంటే మెరుగైన ఆఫర్‌.. రూ.108 రీచార్జ్‌తో..
Bsnl New Offer
Follow us on

BSNL New Offer: ఒకప్పుడు టెలికామ్‌ రంగంలో ఓ వెలుగు వెలిగింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. దేశానికి తొలిసారి ఫోన్‌ను పరిచయం చేసింది ఈ కంపెనీనే. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ కనెక్షన్‌ రావాలంటే కనీసం మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమేణ పోటీ పెరగడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది. బడా కంపెనీలు టెలికాం రంగంలోకి రావడం తక్కువ ధరకే సేవలను అందుబాటులోకి తీసుకురాడంతో ఈ పోటీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనకబడింది.
ఇదిలా ఉంటే తాజాగా రకరకాల ఆఫర్లను తీసుకొస్తూ మళ్లీ రేసులో నిలవడానికి ప్రయత్నాలు చేస్తోందీ ప్రభుత్వ రంగ సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా మరో సూపర్‌ రీచార్జ్‌ ఆఫర్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 108తో రీచార్జ్‌ చేసుకున్న వారికి 60 రోజుల పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో, ఎయిర్‌ టెల్‌ వంటి సంస్థలు 28 రోజుల వ్యాలిడీటీతో రోజుకు 1జీబీ డేటా అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే రీచార్జ్‌ మొత్తం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌తో పోలిస్తే ఎక్కువేనని చెప్పాలి. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కేవలం రూ.108 రూపాయాలకే ఈ ఆఫర్‌న్‌ అందిస్తుండడం విశేషం. ఇక ఈ ఆఫర్‌తో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఉచితంగా 500 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందించనున్నారు. అయితే ఈ కొత్త ప్యాక్‌ ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబయి ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో లభిస్తోంది. త్వరలోనే దేశమంతా అందుబాటులోకి తీసుకువాస్తారని తెలుస్తోంది.

Also Read: Facebook Frames : వ్యాక్సినేషన్‌ కోసంఫేస్‌బుక్‌ సరికొత్త ప్రచారం.. న్యూ ప్రొఫైల్ ఫ్రేమ్స్, స్టిక్కర్స్‌తో అవేర్‌నెస్‌..

Nokia Smartphones: నోకియా నుంచి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌లు.. మళ్లీ పూర్వ వైభవం రానుందా..?

Covid19 Vaccine: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్..