Trai: టెలికాం రంగంలో పలు నెట్‌వర్క్‌లపై వేలాది ఫిర్యాదులు అందినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. మొబైల్ ఆపరేటర్ సర్వీసుల్లో ఉన్న లోపాలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. అయితే అధికంగా ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు ట్రాయ్ తెలిపింది. మంత్రి దేవుసింహ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాదికి సంబంధించి నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశ వ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఎయిర్‌టెల్‌పై 16,111 ఫిర్యాదులు వచ్చాయి. ఇక వొడాఫోన్ ఐడియాపై 14,487, జియోపై 7,341 ఫిర్యాదులు అందినట్లు తెలిపాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌పై 2,913, ఎంఎన్‌టీఎల్‌పై 732 ఫిర్యాదులు వచ్చినట్లు ట్రాయ్ వెల్లడించింది. అయితే వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ ఫిర్యాదుకు స్పందన రాకుంటే వినియోగదారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి: