WhatsApp Scam: మీకు ఈ వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయా..? జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!

|

Nov 19, 2021 | 8:48 PM

WhatsApp Scam:  ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అసరా చేసుకుని కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో..

WhatsApp Scam: మీకు ఈ వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయా..? జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!
Follow us on

WhatsApp Scam:  ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అసరా చేసుకుని కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా మోసగించే నేరగాళ్లు.. ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించి కూడా మోసగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించేది వాట్సాప్‌. ఇది లేనిది స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఇక తాజాగా వాట్సాప్‌ స్కామ్‌ ట్రిక్‌ ద్వారా మోసాలు జరుగుతున్నాయి. యుకెకు చెందిన ప్రభుత్వ సంస్థ సఫోల్క్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ మోసగాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా నటిస్తూ నకిలీ సందేశాలను పంపిస్తూ మిమ్మల్ని మోసగించే ప్రమాదం ఉందని వాట్సాప్‌ సంస్థ హెచ్చరిస్తోంది.

ఇటీవల కెస్సింగ్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తె అని పేర్కొంటూ గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. ఆమె వాష్‌ రూమ్‌లో పడిందని, ఇది కొత్త కొత్త నెంబర్‌ అని సైబర్‌ నేరగాళ్లు ఈ మెసేజ్‌ను పంపించారు. మీ కూతురు మెడికల్‌ బిల్లు చెల్లించడానికి ఆమెకు డబ్బులు పంపాలని కోరారు. కానీ జాగ్రత్తగా వ్యవహరించిన ఆమె నేరగాళ్ల భారీ మోసం నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత కూతురికి ఫోన్‌ చేసి అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది. అందుకే వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త ఉండాలని, లేకపోతే మీరు నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తుంటారు. మీ వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో వివరాలు చెప్పవద్దని సూచిస్తున్నారు. ఏ బ్యాంకు కాగా, ఇతర సంస్థలు కూడా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, ఆధార్‌, ఇతర ఫోన్‌ నెంబర్లు ఏవి కూడా అడగరు. అలా అడుగుతున్నారంటే అది నేరగాళ్లేనని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి:

BHIM App: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ నంబర్‌ ఉపయోగించి భీమ్‌ యాప్‌ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.. ఎలాగంటే..!

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ స్కీమ్‌లలో చేరితే నామినీ పేరు ఎందుకు చేర్చాలి? ఒక వేళ నమోదు చేయకపోతే ఏమవుతుంది?