Arattai App: అరట్టై యాప్‌లో అదిరిపోయే ఫీచర్! ఇది వాట్సాప్‌లో కూడా లేదు!

వాట్సాప్ కు పోటీగా ఇండియాలో లాంఛ్ అయిన అరట్టై యాప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ సేమ్ టు సేమ్ ఇందులో ఉండడంతో చాలామంది వాట్సాప్ యూజర్లు అరట్టై కు షిఫ్ట్ అవ్వాలుకుంటున్నారు. అంతేకాదు, వాట్సాప్ లో లేని ఓ కొత్త ఫీచర్ ఇందులో ఉండడంతో ఇది వాట్సాప్ కంటే బెటర్ అని భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే..

Arattai App: అరట్టై యాప్‌లో అదిరిపోయే ఫీచర్! ఇది వాట్సాప్‌లో  కూడా లేదు!
Arattai App (2)

Updated on: Oct 01, 2025 | 1:04 PM

రిలీజైన కొద్ది రోజుల్లో అరట్టై యాప్ మంచి ప్రజాదరణ పొందింది. ఎంతగా అంటే, రిలీజైన రెండు రోజుల్లోనే ఇది ప్లే స్టోర్‌లో హయ్యెస్ట్ డౌన్ లోడ్స్ ఉన్న  మెసేజింగ్ యాప్‌గా మారింది. ఈ యాప్ ను మేడ్-ఇన్-ఇండియా వాట్సాప్ గా పిలుస్తున్నారు. అయితే ఇందులో ఉన్న ఓ కొత్త ఫీచర్ ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తుంది. ఈ ఫీచర్ వాట్సాప్ లో కూడా లేకపోవడంతో యూజర్లు అరట్టై యాప్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్

వాట్సాప్‌లో లాగానే అరట్టై యాప్ లో కూడా మెసేజింగ్,  కాలింగ్, ఫైల్ షేరింగ్, గ్రూప్ కాలింగ్, వాయిస్‌ నోట్స్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్‌ వంటి ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ అనే మరో ఫీచర్ కూడా ఉంది. ఇది వాట్సాప్ లో కూడా లేదు. అరట్టై మెసేజింగ్ యాప్ ను ఆండ్రాయిడ్ టీవీతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్లు ఆండ్రాయిడ్ టీవీలో తమ అరట్టై అకౌంట్ లోకి లాగిన్ అయి పెద్ద స్క్రీన్‌పై అరట్టై ఛాటింగ్ చేసుకోవచ్చు.

గ్రూప్ కాల్స్‌కు..

అరట్టై కేవలం ఆండ్రాయిడ్ కు మాత్రమే కాదు, విండోస్, మాక్, లైనక్స్‌తో సహా ఐదు సాఫ్ట్‌వేర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ కనెక్టివిటీ ఫీచర్ వాట్సాప్‌లో కూడా లేకపోవడంతో యూజర్లు అరట్టైనే బెస్ట్ అని కితాబిస్తున్నారు. గ్రూప్ కాల్స్ చేసుకునేవారికి ఈ ఆండ్రాయిడ్ కనెక్టివిటీ మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. పెద్ద స్క్రీన్‌పై అందర్నీ చూస్తూ గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

వాట్సాప్ కిల్లర్

ఇకపోతే అరట్టై యాప్ ను ఇండియన్  క్లౌడ్ ప్లాట్‌ఫాం జోహో.. తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెసేజింగ్ యాప్‌ కేవలం మూడు రోజుల్లోనే 3.5 సైన్అప్స్‌తో దూసుకెళ్తోంది. దీన్ని ‘వాట్సప్‌ కిల్లర్‌’గా పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది వాట్సా్ప్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందంటున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి