iPhones: ఐఫోన్ వాడేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే మరిన్ని ఫీచర్లు
ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది యాపిల్ సంస్థ., త్వరలోనే సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకురానుంది. డిసెంబర్‌లో ఈ బీటా వెర్షన్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్లతో ఐఫోన్ ఫోన్లలో ఇక ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Apple: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. యాపిల్ కంపెనీ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త బీటా అప్‌డేట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. iOS 26.2 బీటా 3 పేరుతో తీసుకురానున్న ఈ అప్‌డేట్.. త్వరలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ఈ బీటా వెర్షన్ విడుదల అవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్లను జోడించింది. ఇప్పటికే ఉన్న ఫీచర్లకు మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బీటా వెర్షన్‌తో యూజర్లకు ఫోన్లలో ఎలాంటి సమస్యలు ఉండవని యాపిల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కొత్త వెర్షన్‌లో ఎయిర్‌డ్రాప్ ఫైల్స్‌ను మార్చడానికి కొత్త మార్గాన్ని యాపిల్ సంస్థ పరీక్షిస్తోంది. అలాగే 30 రోజుల పాటు కాంటాక్ట్‌ను జోడించాల్సిన అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇంతేకాకుండా రెండు పరికరాల మధ్య వైర్‌లెస్ ఫైల్ ట్రాన్స్‌మిషన్ జరిగేముందు మరిన్ని వివరాలను అడగనుంది. దీంతో పాటు ఐఫోన్లలో సిరి కాకుండా ఇతర థర్డ్ పార్టీ వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఉపయోగించే అవకాశం దక్కనుంది.
వీటితో పాటు కార్‌ప్లేలోని సెట్టింగ్స్ నుంచే ఐఫోన్‌లో పిన్ చేసిన మెస్సేజ్‌లను డిసేబుల్ చేయవచ్చు. ఇక ప్లీస్ స్కోర్ మరింత పెరుగపర్చనుంది. వీటితో పాటు కొత్త లుక్ యాపిల్ న్యూస్ యాప్, మెస్సేజర్ యాప్ డిజైన్లలో మార్పులు చేయనుంది. డిసెంబర్‌లో iOS 26.2 బీటా 3 వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీంతో కొత్త వెర్షన్‌లో వచ్చే ఫీచర్లు ఎలా ఉంటాయోనని యాపిల్ యూజర్లు ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు.




