Croma Apple Fest: యాపిల్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఐఫోన్‌ 12పై రూ. 12 వేల తగ్గింపు.. అంతేకాదండోయ్‌.

|

Jun 05, 2022 | 2:58 PM

Croma Apple Fest: యాపిల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి బంపరాఫర్‌ ప్రకటించింది టెక్‌ దిగ్గజం. క్రోమా యాపిల్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఐఫోన్‌ 12పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌ 12...

Croma Apple Fest: యాపిల్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఐఫోన్‌ 12పై రూ. 12 వేల తగ్గింపు.. అంతేకాదండోయ్‌.
Follow us on

Croma Apple Fest: యాపిల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి బంపరాఫర్‌ ప్రకటించింది టెక్‌ దిగ్గజం. క్రోమా యాపిల్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఐఫోన్‌ 12పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌ 12 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌ అసలు ధర రూ. 65,900 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 56,900కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా ప్రత్యేకంగా మరో రూ. 3000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను సైతం అందిస్తోంది. ఈ ఆఫర్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇలా గరిష్టంగా రూ. 15,610 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే యూజర్ల కోసం క్రోమా నెలకు రూ. 2,683 ఈఎమ్‌ఐతో ఫోన్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కలిపించింది.

ఐఫోన్‌ 12 ఫీచర్లు..

ఐఫోన్‌ 12 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. హెక్సాకోర్‌ ఏ14 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే 24 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 2815 ఎమ్‌ఏహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

వీటిపై కూడా డిస్కౌంట్లు..

క్రోమా యాపిల్‌ ఫెస్టివల్‌ సేల్‌లో కేవలం ఐఫోన్‌ 12 మాత్రమే కాకుండా ఇతర యాపిల్‌ ప్రొడక్ట్స్‌పై కూడా ఆఫర్లు అందిస్తున్నారు. మాక్‌బుక్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచెస్‌, ఇయర్‌ పాడ్స్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. పలు బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..