Apple Airpods: ఇక మీ ఎయిర్‌పాడ్ పోయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు.. అదెలాగంటే..

Apple Airpods: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో సంచలనానికి తెర లేపింది. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లలో సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన యాపిల్..

Apple Airpods: ఇక మీ ఎయిర్‌పాడ్ పోయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు.. అదెలాగంటే..
Airpods

Updated on: Oct 06, 2021 | 5:47 PM

Apple Airpods: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో సంచలనానికి తెర లేపింది. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లలో సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన యాపిల్.. ఇప్పుడు ఎయిర్‌పాడ్‌లలో నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో యాపిల్ దాని వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌(WWDC)లో కోల్పోయిన ఎయిర్‌పాడ్‌లను గుర్తించే సామర్థ్యం ఉన్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ iOS 15 తో రావాల్సిఉంది. కానీ అప్పుడు అది అందుబాటులోకి రాలేదు. అయితే, తాజాగా 9 to 5 Mac నివేదిక ప్రకారం Apple AirPods Pro, AirPods కోసం ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది యాపిల్. ఇది Find My యాప్‌తో అనుసంధానించబడి.. సులభంగా కనుగొనడానికి వీలవుతుంది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..
యాపిల్‌ ఎయిర్‌పాడ్స్ ప్రో, మరియు ఎయిర్‌పాడ్స్ మాక్స్ లో ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌ ద్వారా ఫైండ్ మై నెట్‌వర్క్ టూల్స్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు నిరంతరం బ్లూటూత్ బీకాన్ సందేశాలను పంపిస్తాయి. ఒకవేళ ఎయిర్‌పాడ్‌లు పోయినా సిగ్నల్స్ ఆధారంగా.. ఫైండ్ మై నెట్‌వర్క్‌లో కనిపెట్టవచ్చు. అంతేకాదు.. యూజర్‌కు ఎయిర్‌పాడ్స్‌ల లొకేషన్‌ను విజువల్ ఇండికేటర్‌గా చూపిస్తుంది.

ఎయిర్‌పాడ్స్‌లో కొత్త ఫర్మ్‌వేర్ అప్‌డేట్ ఎలా చేసుకోవాలి..
యాపిల్ ఎయిర్‌పాడ్స్ తీసుకుని చాలా ఏళ్లు అవుతోందా? మరేం పర్వాలేదు. ఫర్మ్‌వేర్‌ ను మీ ఎయిర్‌పాడ్స్‌లోనూ పొందవచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్‌లను కేస్ లోపల పెట్టి.. ఆ కేస్‌ను ఐఫోన్ పక్కన పెట్టాలి. ఫర్మ్‌వేర్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి. దీనికి సంబంధించి మీ మొబైల్ ఫోన్‌లో ఇండికేషన్స్ వస్తాయి. ఫర్మ్‌వేర్ అప్‌డేట్ అయ్యాక ఫోన్‌కు సందేశం వస్తుంది.

Also read:

AP Police: మందలో ఒకడు కాదు.. వందలో ఒకడిగా నిలిచాడు.. ఆ పోలీసుకు సలాం కొట్టిన జనం.. ఎందుకంటే..

Taliban Rule: కళాశాలల చదువు చెల్లదు.. మదర్సాలో శిక్షణ పొందిన వారికే గుర్తింపు.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నయా రూల్!

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..