Apple: మీరు యాపిల్ యూజర్లా..? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ప్రమాదం తప్పదు..

|

Aug 19, 2022 | 1:45 PM

Apple: యాపిల్ ఉత్పత్తులను వాడుతోన్న వినియోగదారులను ఆ కంపెనీ అలర్ట్‌ చేసింది. తమ ప్రొడక్ట్స్‌లోని సాఫ్ట్‌వేర్లలో లోపాన్ని గుర్తించినట్లు యాపిల్‌ యూజర్లను అలర్ట్‌ చేసింది. యాపిల్‌కు సంబంధించిన పలు ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తున్న...

Apple: మీరు యాపిల్ యూజర్లా..? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ప్రమాదం తప్పదు..
Apple Users
Follow us on

Apple: యాపిల్ ఉత్పత్తులను వాడుతోన్న వినియోగదారులను ఆ కంపెనీ అలర్ట్‌ చేసింది. తమ ప్రొడక్ట్స్‌లోని సాఫ్ట్‌వేర్లలో లోపాన్ని గుర్తించినట్లు యాపిల్‌ యూజర్లను అలర్ట్‌ చేసింది. యాపిల్‌కు సంబంధించిన పలు ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో కొన్ని లూప్‌ హోల్స్‌ను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. వీటిని ఆసరగా చేసుకొని హ్యాకర్లు డివైజ్‌లను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని, వెంటనే సాఫ్ట్‌వేర్లను అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లను సూచించింది.

ఐఫోన్‌ 6ఎస్‌ ఆ తర్వాతి మోడల్స్‌, ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జనరేషన్‌ ఆ తర్వాతి మోడల్స్‌తో పాటు ఐప్యాడ్స్‌లోనూ ఈ సాఫ్టవేర్‌ లోపాన్ని గుర్తించారు. అలాగే కొన్ని మ్యాక్‌ కంప్యూటర్లలోనూ సాఫ్ట్‌వేర్‌లోపాలను గుర్తించారు. దీంతో ఈ ప్రొడక్ట్స్‌ వారుతున్న వారందరూ వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని యాపిల్‌ సూచించింది. అయితే ఈ టెక్నికల్‌ లోపాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటి వరకు ఎమైనా దాడులు జరిగాయా అన్న దానిపై మాత్రం కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే యూజర్లు ముందుగా డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ సెక్షన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే డౌన్‌లోడ్ అండ్‌ ఇన్‌స్టాల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవుతుంది. ఈ లోపాలను ఆసరగా చేసుకొని హ్యాకర్లు డివైజ్‌లను తమ కంట్రోల్‌లోకి తీసుకునే ప్రమాదం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత డేటాతో పాటు బ్యాంక్‌ అకౌంట్లు కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి యాపిల్‌ యూజర్లు వెంటనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఉత్తమమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..