Amazon sale: అమెజాన్‌ సమ్మర్‌ సేల్ వచ్చేసింది.. అదిరిపోయే ఆఫర్లు తెచ్చింది. బెస్ట్‌ డీల్స్‌పై ఓ లుక్కేయండి..

Amazon Summer Sale 2022: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తాజాగా సమ్మర్‌ సేల్‌ పేరుతో పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మే 4న ప్రారంభమైన ఈ సేల్‌ మే7తో ముగియనుంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై...

Amazon sale: అమెజాన్‌ సమ్మర్‌ సేల్ వచ్చేసింది.. అదిరిపోయే ఆఫర్లు తెచ్చింది. బెస్ట్‌ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
Follow us
Narender Vaitla

|

Updated on: May 06, 2022 | 1:26 PM

Amazon Summer Sale 2022: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తాజాగా సమ్మర్‌ సేల్‌ పేరుతో పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మే 4న ప్రారంభమైన ఈ సేల్‌ మే7తో ముగియనుంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్‌. మరి సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ డీల్స్‌ని ఓసారి చూసేయండి..

Apple Iphone13:

128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ 13 అసలు ధర రూ. 79,900 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 64,900కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా రూ. 17,000 అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు.

Oneplus 9RT:

ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 42,999 కాగా సమ్మర్‌ సేల్‌లో భాగంగా రూ. 4000 డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 750 వరకు అదరనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi note 11:

రెడ్‌మీ నోట్‌ 11 అసలు ధర రూ. 13,499కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 12,999కే అందుబాటులో ఉంది. అలాగే కోటక్‌ మహీంద్ర, ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనం రూ. 1000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

pTron Force X11 Bluetooth Calling Smartwatch:

పీట్రాన్‌ స్మార్ట్‌ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌తో ఈ వాచ్‌ను రూ. 1,999కే సొంతం చేసుకోవచ్చు.

Amazfit GTS 2 Smart Watch:

ఈ స్మార్ట్‌ వాచ్‌పై 33 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అసలు ధరతో పోలిస్తే రూ. 6000 డిస్కౌంట్‌తో రూ. 11,999కి అందుబాటులో ఉంది.

Samsung 6.5 kg fully automatic top loading washing machine:

వాషింగ్‌ మిషిన్లపై కూడా మంచి డీల్స్‌ ఉన్నాయి. అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన ఈ వాషింగ్‌ మిషిన్‌ 14 శాతం డిస్కౌంట్‌ పోను రూ. 14,490కి అందుబాటులో ఉంది. అలాగే పలు బ్యాంకుల కార్డులపై 10 శాతం ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు.

Mi 50-inches 4K UHD Smart TV:

ఎమ్‌ఐ 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై 29 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. దీంతో ఈ టీవీని రూ. 29,900కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. అలాగే పాత టీవీని ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా అదనంగా రూ. 2000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

boAt Aavante Sound Bar 1160:

బోట్‌ కంపెనీకి చెందిన ఈ సౌండ్‌పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. డిస్కౌంట్‌లో భాగంగా ఈ సౌండ్‌ బార్‌ రూ. 3,999కే అందుబాటులోకి రానుంది. అలాగే ఐసీఐసీఐ కార్డుతో నాన్‌ ఈఎమ్‌ఐతో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. మహారాష్ట్రలోనూ పెరుగుతున్న బాధితులు.. నిన్న మొత్తం ఎన్ని కేసులంటే..

Mothers Day 2022: తల్లి అయిన తర్వాత మహిళలకి ప్రసూతి సెలవులు ఎన్ని రోజులు లభిస్తాయో తెలుసా..?

Shekar Trailer: రాజశేఖర్‌ మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడే.. ఇంట్రెస్టింగ్‌గా ‘శేఖర్‌’ సినిమా ట్రైలర్‌..