AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone Battery Health: మీ ఐఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునేందుకు చిట్కాలు..!

iPhone Battery Health: ఆపిల్.. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ బ్రాండ్‌లలో ఇదొకటి. Apple ఫోన్ బ్యాటరీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ బ్యాటరీ కోసం కంపెనీ లిథియం..

iPhone Battery Health: మీ ఐఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునేందుకు చిట్కాలు..!
Subhash Goud
|

Updated on: May 06, 2022 | 7:22 PM

Share

iPhone Battery Health: ఆపిల్.. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ బ్రాండ్‌లలో ఇదొకటి. Apple ఫోన్ బ్యాటరీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ బ్యాటరీ కోసం కంపెనీ లిథియం అయాన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. లిథియం -అయాన్ బ్యాటరీ (Lithium-ion Batteries)లు వాటి అధిక శక్తి సాంద్రత, వేగవంతమైన ఛార్జింగ్‌ విషయంలో మంచి పేరుంది. అయితే ఐఫోన్‌ వాడిన కొన్ని రోజుల తర్వాత బ్యాటరీ పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. సరైన చిట్కాలు పాటించకపోవడం వల్ల కూడా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. బ్యాటరీని మెరుగు పర్చుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. తాజా సాఫ్ట్‌వేర్‌తో మీ iPhoneని స్పీడుగా ఉండేలా చేసుకోవచ్చు. ఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లి జనరల్‌ని ఎంచుకోండి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సెలెక్ట్‌ చేసుకోండి. తాజా అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లయితే ఫోన్‌ను అప్‌డేట్ చేయండి. ఇది కాకుండా మీరు ఫోన్ బ్రైట్‌నెస్ స్థాయిని తగ్గించుకోవడం వల్ల బ్యాటరీ సామర్థ్యం పెంచుకోవచ్చు. బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవడానికి వినియోగదారులు తక్కువ పవర్ మోడ్‌ని ఉపయోగించుకునే మార్గం కూడా ఉంది. ఫోన్ బ్యాటరీ ఛార్జ్ 20 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువ పవర్ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇక్కడ మీ ఐఫోన్‌ను తక్కువ పవర్ మోడ్‌కు సెట్ చేయవచ్చు. ఇది కాకుండా ఐఫోన్ వినియోగదారులు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి. ఎప్పుడు గానీ.. ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో వంద శాతం కంటే తక్కువగా ఛార్జ్‌ చేసుకోవాలి.

ఎక్కువ కాలం ఐఫోన్ వాడిన తర్వాత బ్యాటరీ ఆరోగ్యం తగ్గిపోయే అవకాశాలు ఉంది. మీరు మీ iPhoneలో బ్యాటరీ లైఫ్‌ పరిస్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. దీన్ని తెలుసుకోవాలంటే ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సిందే. సెట్టింగ్‌లు > బ్యాటరీ >కి వెళ్లండి బ్యాటరీ లైఫ్ తనిఖీ చేయవచ్చు. చాలా మంది తమ ఫోన్‌లను రాత్రిపూట ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి. ఇలా ఫోన్‌ను ఓవర్‌ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. దీని కారణంగా మీ ఫోన్ జీవితకాలం తగ్గిపోతుంది. ఒక్కసారి బ్యాటరీ హెల్త్ పర్సెంటేజీ పడిపోతే బ్యాటరీ హెల్త్‌ని మళ్లీ 100 శాతానికి పెంచలేమని యూజర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాకుండా, బ్యాటరీ దెబ్బతిన్నట్లయితే మరో బ్యాటరీని మార్చడం తప్ప వేరే మార్గం లేదు.

ఒరిజినల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయండి. మీరు మరొక ఛార్జర్‌ను ఉపయోగిస్తే, ఇది మీ ఫోన్ బ్యాటరీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఫోన్ బ్యాటరీని పదేపదే ఛార్జ్ చేయడం వలన ఫోన్ బ్యాటరీ జీవితం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. మీ బ్యాటరీకి సరైన ఒకే రకమైన పవర్ బ్యాంక్‌ను ఎల్లప్పుడూ ఉపయోగించండి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ జీవితం పెరుగుతుంది. బ్యాటరీని ఆదా చేయడానికి లేదా ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. ఈ యాప్స్ ఫోన్ బ్యాగ్రౌండ్ లో నడుస్తాయి. ఇది బ్యాటరీపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Apple: యాపిల్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆ సదుపాయానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్ణయం..

Amazon sale: అమెజాన్‌ సమ్మర్‌ సేల్ వచ్చేసింది.. అదిరిపోయే ఆఫర్లు తెచ్చింది. బెస్ట్‌ డీల్స్‌పై ఓ లుక్కేయండి..