Samsung: అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌.. రూ. 26 వేల 5జీ ఫోన్‌ రూ. 18 వేలకే..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ గతేడాది మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌33 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 25,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా...

Samsung: అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌.. రూ. 26 వేల 5జీ ఫోన్‌ రూ. 18 వేలకే..
Samsung Galaxy M33
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2023 | 9:55 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సామ్‌సంగ్‌ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. 26 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్‌ను ఏకంగా రూ. 18వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌33 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ ఏకంగా 31 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ గతేడాది మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌33 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 25,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌ పరంపర ఇక్కడితో ఆగిపోలేదు. పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 16,500 డిస్కౌంట్‌ పొందొచ్చు. ఒకవేళ పూర్తి స్తాయిలో ఎక్సేంజ్‌ వస్తే ఈ ఫోన్‌ను కేవలం రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఆక్టాకోర్‌ 2.4 జీహెచ్‌జెడ్‌ 5ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌33 ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1080×240 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ ఫోన్‌ స్క్రీన్‌ సొంతం, ఈ స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాడ్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌, 2 ఎంపీ, ఎంపీ కెమెరాలను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఇంటెలిజనెస్స్‌ వాయిస్‌ ఫోకస్‌, పవర్‌ కూల్‌ టెక్నాలజీ, ఆటో డేటా స్విచ్ఛింగ్‌ వంటి అధునాతన ఫీచర్స్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..