ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. బ్లూటూత్ స్పీకర్స్, ఈయర్‌ఫోన్స్, కెమెరాలు వంటి వాటిపై బ్లాక్ ఫ్రైడ్ సేల్ 2022లో పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మరికాసేపట్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అందిస్తోన్న బెస్ట్ ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి..
Sennheiser CX Plus True Wireless:
ఈ వైర్‌లెస్ ఈయర్ బడ్స్ అసలు ధర రూ. 14,990 కాగా బ్లాక్ ఫ్రైడేలో భాగంగా రూ. 7,962కే అందిస్తోంది. ఏకంగా 47 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సలైజేషన్ ఫీచర్‌ను అందించింది. దీంతో యూజర్లు మంచి సౌండ్ అనుభూతిని పొందొచ్చు.
Hisense 43-inch 4K smart TV
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా హిసెన్స్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 20,900కి అందుబాటులో ఉంది. సేల్‌లో ఈ టీవీపై 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
JBL C100SI wired in-ear headphone
జేబీఎల్ కంపెనీకి చెందిన ఈ వైర్ ఈయర్ ఫోన్స్ అసలు ధర రూ. 1000 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 599కే లభిస్తోంది. దీనిని 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ డివైజ్‌తో అందించారు. తక్కువ భరువు, బేస్‌కు ఈ ఈయర్ ఫోన్స్ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పొచ్చు.
BoAt Stone 200 3W Bluetooth speaker
బోట్ బ్లూటూత్ స్పీకర్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బ్లూటూత్ స్పీకర్ రూ. 1299కి అందుబాటులో ఉంది. ఈ స్పీకర్‌ను ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెన్స్‌తో అందించారు. ఆక్స్ పోర్ట్‌ను ప్రత్యేకంగా అందించారు. బ్లూట్‌తో ఫోన్‌కు, టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.
Portronics Pure Sound Pro IV wireless Bluetooth soundbar
ఈ వైర్‌లెస్ బ్లూటూత్ సౌండ్ బార్‌పై అమెజాన్ భారీగా డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏకంగా 80 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ బ్లూటూత్ సౌండ్ బార్ రూ. 1999కి అందుబాటులో ఉంది. 16 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ ఈ స్పీకర్ సొంతం. యూఎస్‌బీ పోర్ట్ ద్వారా కూడా ఈ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..