Virtual Try on: అద్భుత ఫీచర్‌ను తీసుకొస్తున్న అమెజాన్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ప్రొడక్ట్‌ను ట్రాయల్ చేయొచ్చు..
Virtual Try on: టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగం మారుతోంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను..

Virtual Try on: టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగం మారుతోంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. పెరుగుతోన్న పోటీని తట్టుకుని, యూజర్లను తమవైపు ఆకర్షించేందుకు టెక్ దిగ్గజాలు సైతం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఓ అద్భుత ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి అమెజాన్ వర్చువల్ ట్రై-ఆన్ అనే ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటనేగా.. సాధారణంగా మనం ఏదైనా షూ కానీ, చెప్పులు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ట్రాయల్ చేసి సరిపోతుందా లేదో చూసుకొని కోనుగోలు చేస్తుంటాం. అయితే ఇది భౌతికంగా అయితేనే సాధ్యమవుతుంది. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనే నచ్చిన ప్రొడక్ట్‌ను ట్రాయల్ చేసే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? అమెజాన్ తీసుకురానున్న ఫీచర్ ఇలాంటిదే. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన షూ మోడల్‌ను సెలక్ట్ చేసుకొని, తమ కాళ్లకు ధరిస్తే ఎలా ఉంటుందో ఫోన్‌లోనే చూసుకోవచ్చు. అంతేకాదు ఈ ఫొటోలను ఇతరులకు షేర్ చేయొచ్చు.
ఇందుకోసం యూజర్లు ముందుగా తమకు నచ్చిన ప్రొడక్ట్‌ను సెలక్ట్ చేసుకొని, షూ మోడల్ కింద ఉండే అమెజాన్ వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రొడక్ట్ ఇమేజ్ ఉన్న చోట క్లిక్ చేసి ఫోన్ కెమెరాను పాదం దగ్గరగా ఉంచితే చాలు షూ ఫొటో వర్చువల్‌గా పాదంపై పడుతుంది. దీంతో మీ కాలికి షూ సెట్ అవుతుందా.? సదరు షూ కలర్ మీకు సూట్ అవుతుందా లాంటి అంశాలను అనుభూతిని పొందొచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికా, కెనడాలో ఓఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం ఈ ఫీచర్‌ను పరిచయం చేసే ఆలోచన ఉంది అమెజాన్. మరి ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో ఇంకెన్ని మార్పులకు దారి తీస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..