పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు అన్ని రకాల గృహోపకరణాల వరకు డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ డీల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ఏంటా డీల్.? ఎంత ఆఫర్ లభిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 26,999కాగా సేల్‌లో భాగంగా 37 శాతం డిస్కౌంట్‌తో ర. 16,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల వరకు డస్కౌంట్ లభించనుంది. ఇక ఈ ఆఫర్ ఇంతటితో ఆగిపోలేదండోయ్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ సైతం లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా ర. 16000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెసాపిటీతో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎమ్‌ఎక్స్ 890 రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అల్ట్రా స్డీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లను ఇచచారు.
ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో డాల్బీ ఆట్మోస్‌కు సపోర్ట్ చేసే రెండు స్పీకర్‌లను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..