భారతదేశంలో టెలికం కంపెనీలు ఇటీవల కాలంలో రీచార్జ్ ప్లాన్స్ ధరలు బాగా పెంచాయి. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలు ఏకంగా 30 శాతం వరకు ధరలను పెంచాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే నెలవారీ రీచార్జ్ ధరలు ఇంచుమించు రూ.100 వరకు పెరగడంతో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్‌వర్క్‌ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇతర కంపెనీలకు ఎంఎన్‌పీ వైపు మొగ్గు చూపడంతో ఎయిర్‌టెల్ వినియోగదారులను కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలను తీసుకుంది. ముఖ్యంగా నెలవారీ రీచార్జ్ ప్లాన్ ధరలను సవరించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండింట్లో రీచార్జ్ ధరలను సవరించింది. ఎయిర్‌టెల్ రీచార్జ్ ధరల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ కస్టమర్‌లు తమ ఖర్చులను తగ్గించుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఎంట్రీ-లెవల్ ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ కేవలం రూ. 199కి అందుబాటులో ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యవధితో వస్తుంది. అలాగే డేటా అయిపోయిన తర్వాత ఒక ఎంబీకు 50 పైసలు వసూలు చేస్తుంది. అలాగే ఈ ప్లాన్ కింద వింక్ మ్యూజిక్, వింక్‌లో ఫ్రీ హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రిటైల్ కస్టమర్‌లకు నెలవారీ అద్దె రుసుము రూ. 449తో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. అలాగే 200 జీబీ వరకు రోల్‌ఓవర్‌తో 50 జీబీ నెలవారీ డేటా అందిస్తుంది. అలాగే కస్టమర్‌లు 5 జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కాంప్లిమెంటరీ అపరిమిత 5 జీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అలాగే అదనంగా రూ. 349తో ప్లాన్‌కు మరిన్ని కుటుంబ కనెక్షన్‌లను జోడించే అవకాశం కూడా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..