Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Chest X-Ray: వైద్యరంగలోకి విస్తరిస్తున్న ఏఐ.. ఇక దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంచనా వేయొచ్చు

కృత్రిమ మేధ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు గ్యాడ్జెట్స్, యాప్‌ల లాంటి వాటికే పరిమితమైనటువంటి ఏఐ సేవలు.. ఇప్పుడు మెల్లగా వైద్యరంగానికి సైతం క్రమంగా విస్తరిస్తున్నాయి. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ల సహాయంతో.. ఒత్తిడి, ఆందోళనకు గురై ఇబ్బందిపడుతున్న వారికి కూడా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏఐ ఆధారిత ఛాతీ ఎక్స్‌రే వల్ల మనిషి తన వయసును తెలుసుకునే కొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

AI Chest X-Ray: వైద్యరంగలోకి విస్తరిస్తున్న ఏఐ.. ఇక దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంచనా వేయొచ్చు
Artificial Intelligence
Follow us
Aravind B

|

Updated on: Aug 19, 2023 | 5:14 AM

కృత్రిమ మేధ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు గ్యాడ్జెట్స్, యాప్‌ల లాంటి వాటికే పరిమితమైనటువంటి ఏఐ సేవలు.. ఇప్పుడు మెల్లగా వైద్యరంగానికి సైతం క్రమంగా విస్తరిస్తున్నాయి. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ల సహాయంతో.. ఒత్తిడి, ఆందోళనకు గురై ఇబ్బందిపడుతున్న వారికి కూడా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏఐ ఆధారిత ఛాతీ ఎక్స్‌రే వల్ల మనిషి తన వయసును తెలుసుకునే కొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అలాగే ఇందుకు సంబంధించినటువంటి పరిశోధన పత్రం లాన్సెట్ జర్నల్‌లో కూడా ప్రచూరితమైంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎక్స్‌రే సహాయంతో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు.. రక్తపోటు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను కూడా ముందుగానే గుర్తించవచ్చని జపాన్‌లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో సహా వయసురితాయ వచ్చేటుంటి వ్యాధులకు సంబంధించి కూడా జరుగుతున్న పరిశోధనలకు ఇది తోడ్పాటు అందిస్తుందని శాస్త్రవేత్తలు ఆశఆభావం వ్యక్తం చేస్తున్నారు.

వైద్యరంగంలో వయసు పెరుగుదల అనేది ముఖ్యమైన విషయని.. తాము అభివృద్ధి చేసిటువంటి ఛాతి రేడియోగ్రఫీ అనేది మనిషి వయసుతో సహా వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన యసుహితో మిత్సుయమా తెలిపారు. ప్రస్తుతం ఈయన ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్శిటీలోని డయాగ్నస్టిక్స్‌ అండ్ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మనిషి వయసును అంచనా వేసేందుకు 2008 నుంచి 2021 వరకు వైద్య పరీక్షలు చేయించుకున్నటువంటి 34 వేల మందికి సబంధించిన 67 వేల ఛతీ ఎక్స్‌రేలతో కొత్త ఏఐ మోడల్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత నిర్వహించినటువంటి పరీక్షలో కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇలా మొత్తంగా జపాన్‌లోని ఐదు సంస్థల్లో 70 వేల మందికి సంబంధించినటువంటి లక్షకు పైగా ఎక్స్‌రేలపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఏఐ ద్వారా తీసునటువంటి ఛాతీ ఎక్స్‌రే కేవలం వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులన్నింటిని గుర్తించేందుకు మాత్రమే కాక శరీరంలోని ఎముకలు, ఇతర అవయవాల గురించి కూడా తెలుసుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరో విషయం ఏంటంటే భవిష్యత్తులో శస్త్రచికిత్సల్లో కూడా దీన్ని ఉపయోగించేలా మార్పులు కూడా తీసుకొస్తామని యసుహితో తెలిపారు. ఇదిలా ప్రస్తుతం ఏఐ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. భవిష్యత్తు అంతా ఇక అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మయేమేనని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాలపై కూడా ఏఐ ప్రభావం ఉంటుందని.. చాలావరకు ఉద్యోగాలకు ఇది భర్తీ చేస్తుందని అంటున్నారు. అలాగే కొత్త ఉద్యోగాలు కూడా సృష్టిస్తుందని చెబుతున్నారు.

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?