Lay Offs: ఉద్యోగులను సాగనంపే దిశగా అడుగులు.. రంగం సిద్ధం చేస్తోన్న సోషల్‌ మీడియా దిగ్గజం..

|

Aug 14, 2022 | 5:01 PM

Lay Offs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా ఎలాంటి...

Lay Offs: ఉద్యోగులను సాగనంపే దిశగా అడుగులు.. రంగం సిద్ధం చేస్తోన్న సోషల్‌ మీడియా దిగ్గజం..
Follow us on

Lay Offs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ అక్కడి టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండడం చూస్తుంటే మాంద్యం వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌ వంటి కంపెనీలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సోషల్‌ మీడియా దిగ్గజం స్నాప్‌చాట్‌ కూడా తమ ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక కారణాల దృష్ట్యా ఉద్యోగులను తొలగించే దిశగా స్నాప్‌చాట్‌ మేనేజర్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  సుమారు 6 వేల మంది ఉద్యోగులను పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ స్థాయి ఉద్యోగులను తొలగించనున్నారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే స్నాప్‌చాట్‌ ఉద్యోగులను తొలగిచండం ఇదే తొలిసారి కాదు.

2018లోనూ పలువురు ఉద్యోగులను సాగనంపింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్‌ స్పీగెల్ ఉద్యోగుల నియామక ప్రక్రియను నిలిపివేసి, అదనపు వ్యయాలను ఆదా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..